పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మరోమారు కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఇటీవల ఆ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలే తప్ప తమ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై చేయి వేయొద్దని హెచ్చరించారు. "మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు. నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నా. కేవలం మమ్మల్ని అరెస్ట్ మాత్రమే చేయగలరు. ఒంటరిగానైనా సుదీర్ఘ కాలం పోరాటానికి నేను సిద్ధం. ప్రజల మధ్య జరిగే యుద్ధంలో అంతిమ విజయం మాదే" అని దీదీ వ్యాఖ్యానించారు.
ఒకవేళ తమని అరెస్ట్ చేసినా, చేయకపోయినా నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే ఉంటామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణం అనే మాటను వెయ్యి సార్లు అంటానని ఆమె వ్యాఖ్యానించారు. రద్దు నిర్ణయంలో తెర వెనుక బాగోతమేమిటో మాకు తెలియాలని మమత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను బలహీన పరిచేందుకే కేంద్రం ఆ రాష్ట్రాల అధికారులను హెచ్చరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రానికి అధికారాలు ఉన్నట్లే రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉన్నాయని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/