పేటీఎం కాదు..పేపీఎం

Update: 2016-12-01 09:00 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో డిజిట‌ల్ లావాదేవీల్లో పేటీఎం యాప్ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస‌క్తిక‌ర‌మైన ఆరోపణ చేశారు. ప్రధాని తీసుకున్న పెద్దనోట్ల రద్దుతో పేటీఎంకు భారీ లబ్ధి చేకూరిందని విమర్శించారు. పాట్నాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆమె ప్రధానిపై విరుచుకుపడ్డారు.  నవంబర్ 8 నిర్ణయంతో మొబైల్ వ్యాలెట్ పేటీఎంకు భారీ లబ్ధి చేకూరిందని ఆరోపించారు. ఇప్పుడు చిన్నపిల్లలను పేటీఎం పర్యాయపదం ఏంటని అడిగితే పే పీఎం అని ఠక్కున చెప్తున్నారు అని ఆమె వ్యంగ్యాస్త్రం విసిరారు.  మరోవైపు బిగ్‌ బజార్ స్టోర్లలో నగదు విత్‌ డ్రాకు అవకాశం కల్పిస్తూ ఎస్బీఐ నిర్ణయించడంపైనా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలు ఉండటం వల్లే ఆ సంస్థకు అనుమతులు లభించాయని ఆరోపించారు. బిగ్ బజార్ల బిగ్‌ బాస్ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అని విమర్శించారు. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి.. ఈ నిర్ణయం దేశంలోని మహిళలను అవమానించడమే అని మమత విరుచుకుపడ్డారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ   ఈ ప్ర‌యాణంలో ఒంట‌రి అయిన‌ట్లు కనిపిస్తోంది. గత వారం ఆమె నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన నిరసన ర్యాలీకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ - సమాజ్‌ వాదీ పార్టీ - జేడీ యూ - ఆర్జేడీ - ఆమ్‌ ఆద్మీ పార్టీలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. బీహార్‌లో జరిగిన ర్యాలీకి నితీశ్‌ కుమార్ దూరంగా ఉన్నారు. దీంతో నితీశ్ పేరెత్తకుండానే ఆమె ర్యాలీ ముగించారు. ర్యాలీకి ముందు రోజు ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌ ను మ‌మ‌త కలిశారు. ఆయన భార్య - మాజీ సీఎం రబ్రీదేవిని కౌగిలించుకొని ఫొటోలు దిగారు. ర్యాలీకి రావాలని కోరారు. అయినా లాలూ తన ప్రతినిధిని మాత్రమే పంపారు. తాను నోట్ల రద్దును వ్యతిరేకించడం లేదని, కేవలం అమలు విధానాన్ని వ్యతిరేకిస్తున్నానని నితీశ్‌కుమార్‌తో సమావేశం సందర్భంగా లాలూ చెప్పారు. మరోవైపు జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఢిల్లీలో మాట్లాడుతూ, నోట్లరద్దు నిర్ణయంపై నితీశ్‌తో తనకు విభేదాలు లేవని చెప్పారు. దీంతో మమత మరింత ఇరకాటంలో పడ్డా రు. ఈ వారం మొదట్లో లక్నోలో ర్యాలీ సం దర్భంగా సీఎం అఖిలేశ్ యాదవ్ మమతను ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకొన్నారు. అయితే ర్యాలీలో ఆయన పాల్గొనకుండా మంత్రులను మాత్రమే పంపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News