దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారసత్వం విషయంలో అన్నాడీఎంకే నేతలే వాదులాడుకోవడం కాదు. ఆమె రక్తం పంచుకొని పుట్టిన వాళ్లమంటూ కూడా పలువురు హల్ చల్ చేస్తున్నారు. అలా తనదైన శైలిలో గలాటా సృష్టించిన ఓ వ్యక్తిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు సైతం పసిగట్టగలిగే నకిలీ పత్రాలతో కోర్టును ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ సదరు వ్యక్తిని సంగతి తేల్చాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన కృష్ణమూర్తి దివంగత సీఎం జయలలిత, సినీనటుడు శోభన్ బాబుకు పుట్టిన సంతానం తానేనని ప్రకటించుకున్నాడు. 1985లో తాను జయలలితకు జన్మించానని, ఆ మరుసటి సంవత్సరం తనను ఈరోడ్‌కు చెందిన వసంతమణికి దత్తత ఇచ్చారని కృష్ణమూర్తి తెలిపాడు. దత్తత పత్రంపై తన తల్లిదండ్రులైన జయలలిత-శోభన్ బాబుతో పాటు దత్తత తీసుకున్న వసంతమణి ఫొటోలు, సంతకాలు ఉన్నాయని, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సాక్షిగా సంతకం చేశారని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో జయలలిత ఆస్తులు తనకే దక్కాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు ఒరిజనల్ కాదని, తప్పుడు పత్రాలు సృష్టించాడని తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రముఖుల ఫొటోను పత్రాలపై అతికించి తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుతో ఆటలు ఆడుకునే ప్రయత్నం చేశారు అని జస్టిస్ ఆర్ మహదేవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా న్యాయస్థానం సమయం వృదా చేసిన కృష్ణమూర్తి అందించిన పత్రాలను పరిశీలించి అందులో నిజాలను నిగ్గుతేల్చాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తికి మద్దతుగా కోర్టుకు వచ్చిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిని న్యాయమూర్తి మందలించారు. ఇందులో మీ పాత్ర ఏమిటి? ఇందులో ఎందుకు భాగస్వామ్యం పంచుకున్నారు అంటూ ఆయనపై ప్రశ్నల వర్షం గుప్పించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/