సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న పిచ్చ పీక్స్ కు వెళుతోంది. ఇందుకోసం కొందరు చేస్తున్న పనులు దారుణంగా ఉంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. వీడియోను చూస్తుంటేనే ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. అతగాడి వికృతచర్యకు ఘాటు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జంతు ప్రేమికులైతే అతడిపై కేసు పెట్టాలన్న డిమాండ్ చేస్తున్నారు. వైరల్ గా మారిన ఈ వైనంలోకి వెళితే..
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక యువకుడు ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వెర్షన్’ పేరుతో బతికి ఉన్న పామును తింటూ వీడియో తీసుకున్నాడు. తన పాపులార్టీ పెంచుకోవటం కోసం తొలుత పాముపిల్ల తలను నోట్లో పెట్టుకొన్నయువకుడు కొంచెం కొంచెంగా నమిలేశాడు. చివరకు తోకను మింగేశాడు. దీనికి సంబంధించిన వికృత వీడియో వైరల్ గా మారింది.
ఇతగాడి చర్యపై పలువురు మండిపడుతున్నారు. ఇదెక్కడి దారుణమని తిట్టిపోస్తున్నారు. ఈ యువకుడి చర్యకు సదరు పాముపిల్ల మెలికలు తిరుగుతూ గిలగిలమన్న వైనం అయ్యో అనిపించేలా ఉంది. ఈ వీడియోలో సదరు యువకుడు.. ‘సాజిద్ మంచినీళ్ల బాటిల్ తీసుకురా’ అంటూ మిత్రుడితో అన్న మాటలు వినిపిస్తున్నాయి. కేవలం పాపులార్టీ కోసం ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్న వారిని వదిలిపెట్టకూడదని.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలన్నడిమాండ్ పెరుగుతోంది. ఈ వీడియోలని యువకుడి తీరును తప్పు పడుతూ.. తెలంగాణ డీజీపీ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేశారు. మరి.. పోలీసులేం చేస్తారో చూడాలి.