మెట్రో రైల్లో పెద్ద‌మ‌నిషి పాడు బుద్ధి

Update: 2017-05-17 14:39 GMT
చూసేందుకు పెద్ద‌మ‌నిషిగా క‌నిపించే అత‌గాడి ఛీప్ బుద్ధిని ఒక మ‌హిళ తెలివిగా వ్య‌వ‌హ‌రించి తాట తీసింది. మెట్రో రైల్లో ప్ర‌యాణిస్తూ.. పెద్ద‌మ‌నిషిగా ఫోజు కొట్టిన ఆ వ్య‌క్తి వ‌క్ర‌బుద్ధిని ప‌సిగ‌ట్టిన ఆ మ‌హిళ అత‌డ్ని బ‌జార్లో పెట్టేసి.. కాళ్ల బేరానికి వ‌చ్చేలా చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

శ‌నివారం సింగ‌పూర్‌ లోని ఔట్రామ్ స్టేష‌న్ నుంచి హార్బ‌ర్ ఫ్రంట్ కు వెళుతున్న మెట్రో  రైల్లో ఒక యువ‌తికి ఎదురుగా కూర్చున్నాడో వ్య‌క్తి. చూసేందుకు హుందాగా ఉన్న ఆ వ్య‌క్తి.. త‌న సెల్ ఫోన్ తీసి ర‌హ‌స్యంగా ఆమెను వీడియో తీయ‌సాగాడు.  అయితే.. ఆ మ‌హిళ‌కు ఏదో అనుమానం వ‌చ్చింది. అనుకోని రీతిలో అత‌డి వెనుక‌న ఉన్న అద్దంలో అత‌గాడు వీడియో తీస్తున్న వైనాన్ని గుర్తించింది.

వెంట‌నే అత‌డు చేస్తున్న వెధ‌వ ప‌నిని తానూ చ‌ప్పుడు చేయ‌కుండా చిత్రీక‌రిస్తూ ఉండిపోయింది. ఈ వ్య‌వ‌హారం మొత్తాన్ని వీడియో తీసిన ఆమె త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప‌బ్లిక్ ప్లేసుల్లో మ‌న చుట్టూ అమాయ‌కుల్లా క‌నిపించే వారిలో ఎంత మాయ‌కులు ఉంటార‌న్న విష‌యాన్ని త‌న పోస్ట్ చేసిన వీడియోతో చెప్పేసింది. ఇత‌గాడు చేసిన పాడు ప‌నిని కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలో 50 లక్ష‌ల మంది చూడ‌ట‌మే కాదు.. ఇదో పెద్ద వైర‌ల్ గా మారింది.

త‌న పాడుబుద్ధిని కెమేరా సాక్షిగా చూపించిన స‌ద‌రు మ‌హిళ‌కు సారీ చెప్పేసిన ఈ వెధ‌వ‌.. త‌న‌ను వ‌దిలేయాల‌ని వేడుకోవ‌టం మొద‌లెట్టాడు. తాజాగా స‌ద‌రు మ‌హిళ మీద అత‌గాడి కామెంట్ ఏమిటంటే.. త‌ప్ప‌యిపోయింది.. నువ్వు నా చెల్లెలు లాంటిదానివంటూ వేడుకుంటున్నాడు.  చెత్త‌ప‌నులు చేయ‌టం ఎందుకు? త‌ర్వాత త‌ప్పైంద‌ని కాళ్ల బేరానికి దిగ‌టం ఎందుకు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News