మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరు మహానగరంలో ఒక దారుణం చోటు చేసుకుంది. నగరంలోని విజయనగర్ లోజరిగిన ఈ ఘటన సిటీలో సంచలనంగా మారింది. కాఫీడేలో కాఫీ తాగుతున్న వ్యక్తిపై దాడి చేయటమే కాదు.. కత్తులతో పొడిచిన పోట్లకు సదరు వ్యక్తి అక్కడిక్కడే మరణించటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు.
ఎలాంటి భయం లేకుండా గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అందరూ చూస్తున్న వేళ.. కత్తితో పోట్లు పొడిచేసి మర్డర్ చేయటానికి వెనుకాడని వైనం భయాందోళనలు కలిగిస్తున్నాయి. 35 ఏళ్ల మహేశ్ .. అతని స్నేహితుడు రక్షిత్ ఇద్దరూ కాఫీడేలో కాఫీ తాగుతున్న వేళ.. నలుగురు దుండగులు వచ్చి వారి మీద దాడి చేశారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మహేశ్ ను కత్తితో పొడిచేశారు. మరికొందరు రక్షిత్ మీద దాడి చేశారు.
ఈ ఘటనలో మహేశ్ ఘటనాస్థలంలోనే మరణించగా.. రక్షిత్ తీవ్ర గాయాలపాలయ్యారు. అతన్ని ఆసుపత్రికి చేర్పించారు. మరణించిన మహేశ్ పై పలు కేసులు ఉన్నాయని చెబుతున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ఏమైనా మహానగరంలో అందరూ చూస్తుండగా జరిగిన దాడి షాకింగ్ గా మారిందని చెప్పొచ్చు. సీసీ కెమేరాలో లభించిన ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇప్పటివరకూ ఈ ఉదంతానికి సంబంధించి ఒక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది.