చైనా వారికీ ఇక బుద్ధిరాదు ..మళ్లీ ఏమైందంటే !

Update: 2020-05-01 11:50 GMT
తినడంలో చైనావారికీ ఏ దేశస్తులు సాటిరారు. చైనా వారి ఆహారపు అలవాట్లు ఏ విదంగా ఉంటాయో అందరికి తెలిసిందే. చైనీయులు ఒక్క మనిషిని తప్ప ..మిగిలిన అన్ని రకాల జీవులని తినేస్తారు. అలా ఇష్టం వచ్చింది తినే ఇప్పుడు కరోనా కి కారణమైయ్యారు. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. అయినా కూడా వారిలో కొంచెం కూడా మార్పురాలేదు. దీనికి నిదర్శనం ఈ వ్యక్తే .

పూర్తి వివరాలు చూస్తే ..చైనాలోని సుక్వీన్ ప్రాంతానికి చెందిన వాంగ్ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడుతున్నాడు. దీనితో స్థానిక హాస్పిటల్‌ లో వైద్యులను సంప్రదించాడు. అతడి వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు నువ్వు నిత్యం ఏ ఆహారం తీసుకుంటావని అతడిని అడిగారు. తాను ఎక్కువగా సీఫుడ్‌ ను పచ్చిగా తింటానని చెప్పాడు. అలాగే పాములను చంపి, వాటి పిత్తాశయాన్ని కూడా పచ్చిగా తినేస్తానని తెలిపాడు.

దీంతో డాక్టర్లు అతడికి నీకు ఎక్కువ రోజులు లేవు అని చాలా కూల్ గా చెప్పారు. నువ్వు తినే ఆహారం వల్ల ఊపిరితీత్తులలో పురుగులు పట్టేశాయని చెప్పారు. దీన్నే పరాగోనిమియాసిస్ (Paragonimiasis) అంటారని తెలిపారు. పాముల పిత్తాశయం తినడం వల్ల ఊపిరితీత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు. ఈ ఘటనపై హాస్పిటల్‌లోని రెస్పిరటరీ డాక్టర్ జహ్వో హయాన్ మాట్లాడుతూ.. పాములు, సీఫుడ్‌ లను పచ్చిగా తినడం వల్ల అందులో జీవించే టేప్‌ వార్మ్ వంటి పరాన్నజీవుల గుడ్లు శరీరంలోకి వెళ్తాయని, అక్కడే అవి పెద్దవై అనారోగ్యానికి గురిచేస్తాయని తెలిపారు. మరి, ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న కూడా ఈ చైనా వారిలో మాత్రం మార్పు రావడంలేదు. మరి వారిలో మార్పు ఎప్పుడు వస్తుందో .అసలు వస్తుందో లేదో..
Tags:    

Similar News