ఔను. కాంగ్రెస్ కార్యకర్త..సిద్ధాంతపరంగా ప్రత్యర్థి అయిన బీజేపీ రథసారథి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెగ మెచ్చుకుంటున్నాడు. అలాగని అల్లా టప్పా కూడా కార్యకర్త కూడా కాదు కాంగ్రెస్ పార్టీ అనుబంధ స్టూడెంట్ వింగ్ లో సభ్యుడు కూడా. అలాంటి వ్యక్తి మోడీని ఎందుకు అభిమానిస్తున్నాడంటే....ప్రధాని సలహా పాటించి కోటీశ్వరుడయ్యాడు. మోడీ ఇచ్చిన ఆ అద్భుతమైన సలహా పాటించి రోజుకి నాలుగు గంటలు మాత్రమే కష్టపడి కోట్లు సంపాదించాడీ కాంగ్రెస్ కార్యకర్త. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని వడోదరకి చెందిన నారాయణ్ భాయ్
ఇంతకీ గుజరాత్ కాంగ్రెస్ కార్యకర్తకు ప్రధాని ఇచ్చిన సలహా ఏంటనుకుంటున్నారా?... కొన్ని నెలల క్రితం నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రధాని మోడీ - ఇతర బీజేపీ నాయకులు ఖాళీగా ఉండటం కంటే పకోడీ అమ్ముకోవడం మేలని, పకోడి అమ్ముకున్నా లక్షల రూపాయలు సంపాదించవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా నెగిటీవ్ కామెంట్లు వచ్చాయి. అనేక ఇతర పార్టీలతోపాటు కాంగ్రెస్ కూడా దీన్ని వ్యతిరేకించింది. అయితే వడోదరకి చెందిన నారాయణ్ భాయ్ దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు.ప్రధానమంత్రే చెప్పాడంటే ఇందులో ఏదో కిటుకు ఉందనుకున్నాడు.
పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తిచేసి ఎన్ని ఉద్యోగాలకు అప్లయి చేసినా జాబ్ రాక నిరుద్యోగిగా ఉన్న నారాయణ్ భాయ్ ప్రధాని సలహా పాటించి కోటీశ్వరుడవ్వాలని భావించాడు. వెంటనే వడోదరలో పకోడీ స్టాల్ ను ప్రారంభించాడు. దానికి శ్రీరామ్ దాల్ వడ సెంటర్ అని పేరు పెట్టాడు. షాపు ప్రారంభించిన రెండునెలల్లోనే నారామణ్ భాయ్ షాపు పకోడా టేస్ట్ గురించి ఆ నగరంలో అంతా చర్చ మొదలైంది. పకోడీ తినాలంటే శ్రీరామ్ దాల్ వడ సెంటర్ కే వెళ్లాలి అని సిటీ ప్రజలు అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకూ రోజుకీ 300 కిలోల చొప్పున నెలకు 9 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అసలు పకోడీ అమ్మి కోట్లు సంపాదించవచ్చా అని నారాయణ్ భాయ్ స్టోరీ చదివిన వాళ్లందరూ ఆశ్యర్యపోతున్నారు. అంతేకాకుండా ప్రదాని మోడీ ఫార్ములాకు ఫిదా కూడా అవుతున్నారు.