ఆ డ‌బ్బుకోసం దొంగ‌గా మారిన స‌ర్పంచ్ భ‌ర్త‌!

Update: 2018-07-12 01:30 GMT
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భార్య‌లు పోటీ చేయ‌డం....వారి త‌ర‌ఫున ఓట్ల కోసం భ‌ర్త విచ్చ‌ల విడిగా డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డం మామూలే. భార్య గెలిచిన త‌ర్వాత ఆమె స్థానంలో భ‌ర్త అనధికారికంగా `అధికారం` చ‌లాయించ‌డం......ఎన్నిక‌ల‌కు ముందు అప్పు సప్పు చేసో....ఆస్తుల‌మ్మో ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బుకు నాలుగింత‌లు ప్రజాధనాన్ని దోచుకోవ‌డం స‌ర్వ సాధారణం. అయితే, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో స‌ర్పంచ్(గ్రామ్ ప్ర‌ధాన్) గా గెలుపొందిన భార్య కోసం చేసిన ఎన్నిక‌ల ఖ‌ర్చును రాబ‌ట్టేందుకు ....ఓ భ‌ర్త రాబిన్ హుడ్ అవ‌తార‌మెత్తి దొంగ‌లా మారాడు. అంద‌రిలా ప్ర‌జాధ‌నాన్ని దోచుకోకుండా....రాజ‌కీయ నాయకులు - ప్ర‌భుత్వ అధికారుల‌ను దోచుకుంటూ ...ఆ డ‌బ్బును సంపాదించాల‌ని ప్లాన్ వేశాడు. అయితే, చివ‌ర‌కు అత‌డి బండారం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో క‌ట‌క‌టాల పాల‌య్యాడు.

యూపీలోని ప్రతాప్ ఘడ్ జిల్లా లాల్ గంజ్ బ్లాక్ లోని మద్వా గ్రామానికి చెందిన పంచ్ లాల్ వర్మ భార్య సంగీతా వర్మ గ్రామ ప్రధాన్ గా గెలుపొందింది. భార్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయిన‌ ఖర్చుతోపాటు విజయోత్సవ స‌భ కోసం భారీగా ఖ‌ర్చు చేశాడు. ఈ క‌మంలోనే స్నేహితులు - బంధువుల నుంచి రూ.25 లక్షలు అప్పు చేశాడు. అయితే, పంచ్ లాల్ అంద‌రిలాగా అధికారం చ‌లాయిస్తూ....ప్ర‌భుత్వ నిధులు స్వాహా చేసి ఆ డ‌బ్బు రాబ‌ట్టాల‌నుకోలేదు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఆ డ‌బ్బును సంపాదించేందుకు పంచ్ లాల్ దొంగగా మారాడు. త‌న స్నేహితులతో క‌లిసి రాబిన్ హుడ్ లా మారిన పంచ్ లాల్ గ‌త మూడేళ్లుగా దొంగ‌తనాలు చేయ‌డం ప్రారంభించాడు. రాజ‌కీయ‌నాయకులు - ప్రభుత్వ అధికారులు, ప్రముఖ వ్యాపారులను టార్గెట్ చేసి చేసుకొని దోపిడీలు చేశాడు. అయితే, 65 దోపిడీలకు పాల్పడిన పంచ్‌ లాల్ వర్మను ప్ర‌తాప్ గ‌ఢ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

అయితే, ప్ర‌జాధ‌నాన్ని దోచుకోకూడ‌ద‌నే కాన్సెప్ట్ బాగానే ఉన్నా....ఆ ప్రాసెస్ లో తాను దొంగ‌గా మారుతున్నాన‌నే లాజిక్ ను పంచ్ లాల్ మిస్స‌య్యాడు. ఈ దొంగ‌తనాల వెనుక ఉద్దేశం ఏదైనా....చ‌ట్టం దృష్టిలో నేర‌స్థుడిగానే మిగిలాడు.  అయితే, స్థానికంగా ఈ వార్త వైర‌ల్ అయింది. పంచ్ లాల్ పై కొంద‌రు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అంద‌రూ గెలిచాక ప్ర‌జ‌ల ధ‌నం దోచుకుంటే పంచ్ లాల్...ప్ర‌జాధనం దోచుకునే రాజ‌కీయ నేత‌ల డ‌బ్బు కొట్టేశాడని అనుకుంటున్నారు. పైగా, పంచ్ లాల్ అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని, కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులతో పోలిస్తే పంచ్ లాల్ బెట‌ర్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News