దారిన పోయేది మీద వేసుకోవటం అంటే ఇదే. ఉడుం ఒకటి తన దారిన తాను పోతుంటే.. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి కొండల్లో ఇరుక్కుపోయిన వైనమిది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మద్నూరు మండటం పెద్ద శెక్కర్గకు చెందిన 22 ఏళ్ల హన్మాండ్లు ఓ గొర్రెల కాపరి. ఆదివారం అతగాడు.. గొరెల్ని కాయటానికి వెళ్లాడు. దారిలో ఒక ఉడుము కనిపించింది.
దాన్ని పట్టుకోవాలని ఆశపడ్డ హనుమాండ్లు.. బండరాళ్ల మధ్యకు వెళ్లాడు. అక్కడ నుంచి సదరు ఉడుం లోపలికి జారిపోగా.. దాన్ని ఏదోలా పట్టుకోవాలని భావించిన అతగాడు.. ఉత్సాహంలో ముందు వెనుకా చూసుకోకుండా బండరాళ్ల మధ్య ప్రవేశించాడు. అంతే ఉడుం చేజారింది. హనుమాండ్లు మాత్రం అడ్డంగా ఇరుక్కుపోయాడు.
అతన్ని కాపాడేందుకు అతని వెంట ఉన్న స్నేహితులు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో.. గ్రామస్థులకు ఫోన్లు చేయటంతో అతన్ని రక్షించుకునేందుకు పలుగు.. పారలుపట్టుకొని వచ్చారు. అయినా సాధ్యంకాకపోవటంతో చివరకు జేసీబీని తీసుకొచ్చి.. తవ్వటం మొదలు పెట్టారు. చివరకు అతను ఇరుక్కుపోయిన ప్రాంతాన్ని క్రమపద్దతిలో తవ్వటంతో అతగాడు బయటపడ్డాడు.
దారిన పోయే ఉడుంను వదిలేయకుండా.. దాన్ని పట్టుకోవాలన్న తపనతో ఇరుక్కుపోయిన హనుమాండ్లను చూసిన గ్రామస్థులు నవ్వితే.. ప్రాణపాయ స్థితి వరకూ వెళ్లి బయటపడ్డ హనుమాండ్లు మాత్రం భయంతో వణికిపోయాడు. దారిన పోయే దాన్ని వదిలేయకుండా.. దాన్నేదో చేద్దామనుకుంటే ఇలాంటివే జరుగుతాయనుకోవటం అక్కడ వినిపించింది.