ఈ భార్యభర్తల మాదిరి దేశంలో మరే జంటకు ఛాన్స్ దక్కలేదు

Update: 2019-09-28 08:14 GMT
కొన్నికాంబినేషన్లు చాలా అరుదుగా ఉంటాయి. చరిత్రలో ఒకట్రెండుసార్లు మాత్రమే ఇలాంటివి చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే పంజాబ్.. హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు ఒకటే హైకోర్టు. అయితే..లాయర్లుగా ఉన్న భార్యభర్తలు ఇద్దరూ ఒకేసారి న్యాయమూర్తులుగా అవకాశం లభించటం ఒక ఎత్తు అయితే.. ఒకే దఫా వీరిద్దరూ ప్రమాణస్వీకారాన్ని చేయనున్నారు.

ఇలాంటి ఉదంతం దేశ చరిత్రలో ఇప్పటివరకూ చోటు చేసుకోలేదని.. ఇదో అరుదైన సందర్భంగా పలువురు అభివర్ణిస్తున్నారు. పంజాబ్.. హర్యానా రాష్ట్రపరిధిలో న్యాయమూర్తులుగా వివేక్ పూరి.. అర్చనా పూరిలు ఇద్దరూ నియమితులయ్యారు.

పంజాబ్ .. హర్యానా హైకోర్టుకు చెందిన లాయర్లు అయిన ఈ ఇద్దరూ ఒకేసారి జడ్జి పోస్టులు పొందటం ఒక ఎత్తు అయితే.. వీరిద్దరూ ఒకేసారి పోస్టింగులు లభించటం.. ఒకేసారి ప్రమాణస్వీకారం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. అర్చనకు రాష్ట్ర రవాణా ట్రిబ్యునల్.. ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్ లో ప్రిసైడింగ్ అధికారిగా పదోన్నతి లభించింది. మొత్తంగా లాయర్లు అయిన భార్యభర్తలు ఒకేసారి న్యాయమూర్తులు కావటం విశేషంగా మారింది.


Tags:    

Similar News