పాపం సుమలత.. 2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి ఆ విజయాన్ని తన భర్తకు నివాళిగా అందివ్వాలని ఆశ పడుతుంటే.. ఆమెను అడ్డుకోవడానికి జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి చెయ్యని కుట్రలు లేవు. మండ్యా లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో.. సుమలత ఇండిపెంటెంట్ గా పోటీ చేస్తున్నారు. ఇక ఆమెను మానసికంగా హింసించాలని అనుకుంటున్న జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి నాయకులు.. ఆమె కులంపై దెబ్బకొడుతున్నారు. అసలు ఆమె కన్నడిగురాలే కాదని.. అంబరీష్ కులమే కాదని పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే సుమలత సొంత ఊరు గుంటూరు. ఆమె కమ్మ కులానికి చెందిన అమ్మాయి. సినిమాల్లో స్టార్ హీరోయిన్ హోదా వచ్చిన తర్వాత కన్నడ నటుడు అంబరీష్‌ని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఒక మహిళ ఒక వ్యక్తిని భర్తగా పొందిన తర్వాత అతడే సర్వస్వం. అతని ఇంటిపేరే ఆమె ఇంటిపేరు ఉంది. అతని కులమే ఆమె కులం అవుతుంది. ఈ విధంగా అంబరీష్ గౌడ కులానికి చెందిన వ్యక్తి కావడంతో.. సుమలత కూడా గౌడ అయ్యారు. కానీ ఇది జీర్ణించుకోలేని కొందరు సన్నాసులు ఆమె గౌడ కులానికి ఎలా చెందుతుంది అని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించిన వాడు ఏ చదువుకోని మొద్దో అయితే పెద్దగా సమస్య ఉండేది కాదు. అడిగింది మండ్య సిట్టింగ్ ఎంపీ శివరామగౌడ. ఇలాంటి వాళ్లని ఎన్నుకుని మనం పార్లమెంట్ కు పంపిస్తున్నాం.
మరోవైపు.. అంబరీష్ అభిమానులు కూడా సుమలతకు మద్దతుగా నిలబడుతున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్లు సోనియా గాంధీని అడగగలరా అని ప్రశ్నించారు. ఇక ఈ కుల చిచ్చుపై అటు కుమారస్వామి కానీ దేవేగౌడ కూడా ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.