పైడికొండలకు ‘గాలి’ సోకింది..

Update: 2016-11-24 06:56 GMT
కర్ణాటకమాజీ మంత్రి - మైనింగ్ కింగ్ గాలి జనార్దన రెడ్డి పిలుపు మన్నించిన ఏపీ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారట.  అనుకోకుండా గాలి జనార్దనరెడ్డి ఇంటికి వెళ్లిన ఆయన పార్టీ అధిష్ఠానం నుంచి అంతర్గత నోటీసు అందుకున్నట్లు సమాచారం.  ఇంతకీ ఏం జరిగిందంటే...
    
బళ్లారిలో నిర్వహించే ఓ కార్యక్రమానికి వెళ్లడానికి పైడికొండల మాణిక్యాలరావు పర్యటన షెడ్యూలు రెండు నెలల ముందే కన్ఫర్మయింది. దాని ప్రకారం  ఆయన బళ్లారి వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ బీజేపీ నేత శ్రీరాములు మంత్రిని తన ఇంటికి రావాల్సిందిగా మర్యాద కోసం ఆహ్వానించగా పైడికొండల అందుకు అంగీకరించి ఆయనతో వెళ్లారు. అయితే... ఆయన వెళ్లిన కొద్దిసేపటికే గాలి జనార్దనరెడ్డి అక్కడకు వచ్చారు. మంత్రిని చూసిన ఆయన వారం కిందట వివాహమైన తన కుమార్తెను ఆశీర్వదించాలంటూ మంత్రిని కోరారు. సంప్రదాయాలకు సంబంధించిన అంశం కావడంతో పైడికొండల ఆయన రిక్వెస్టును కాదనలేకపోయారు. గాలితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను ఆశీర్వదించారు.
    
కానీ... ఆ తరువాతే అసలుకథ మొదలైంది. నల్లధనం నిరోధానికి మోడీ భారీ సంస్కరణలు చేపట్టిన తరుణంలో పైడికొండల ఇలా నల్లధనవంతుడిగా పేరున్న గాలి ఇంటికి వెళ్లడంపై విమర్శలు రేగాయి. చివరకు అధిష్ఠానం కూడా ఆయనకు నోటీసు ఇచ్చినట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News