మొహం బాగోలేక అద్దం పగులగొట్టడమంటే ఇదే..!మీరు ఓడిపోతే మనీశ్​ పై వేటా?

Update: 2021-04-16 17:30 GMT
సన్​రైజర్స్​ జట్టు మనీశ్​ పాండేపై వేటు వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు మ్యాచ్​ ల్లోనూ హైదరాబాద్​ జట్టు ఘోరంగా ఓడిపోయింది. రషీద్​ ఖాన్​, నటరాజన్​ లాంటి బౌలర్లు, డేవిడ్​ వార్నర్​, వృద్ధిమాన్​ సాహా, విలియమ్సన్​ వంటి బ్యాట్స్​మన్లు ఉన్నప్పటికీ సన్​రైజర్స్​ పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు రెండు మ్యాచ్​లు ఆడగా.. రెండు సార్లు హైదరాబాద్​ ఓడిపోయింది. చెన్నైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై.. 6 పరుగుల తేడాతో,  ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ ఎస్​ఆర్ హెచ్​  ఓడిపోయింది. అయితే రెండు సార్లు ఎస్​ఆర్​ హెచ్​ బ్యాట్స్​మెన్​ తీవ్రంగా విఫలమయ్యారు.

ఓపెనర్లు, ఇటు మిడిల్​ ఆర్డర్ లో ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో జట్టు ఓటమి పాలైంది. దీంతో ఉప శమన చర్యలు తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నది. అయితే బ్యాట్స్ మెన్లను మార్చాలని చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలో తక్కువ స్ట్రయిక్​రేట్​ ఉన్న మనీశ్​ పాండే పై వేటు వేయాలని జట్టు భావిస్తున్నది. అయితే ఐపీఎల్​ లో మనీశ్​ కంటే తక్కువ స్ట్రయిక్​ రేట్​తో ఉన్నవారు ఉన్నారు. మరోవైపు మనీశ్​ గత సీజన్​లోనూ పెద్దగా రాణించలేదు. ఇందుకు సంబంధించిన ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

 మనీశ్​ కంటే చాలా మందికి తక్కువ స్ట్రయిక్​ రేట్స్​ ఉన్నాయని అటువంటి వాళ్లను.. ఆయా జట్లు వదులుకోవడం లేదని.. కానీ ఎస్​ఆర్​ హెచ్​ మాత్రం మనీశ్​ ను ఎందుకు వదులుకుంటున్నదని కొందరు సీనియర్​ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అజింక్య రహానె 121.38 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. అయినా అతడిపై వేటు పడలేదు.  పాండే స్ట్రైక్‌ రేట్ 121.59. గౌతమ్ గంభీర్ 123.88 స్ట్రైక్ రేట్ మాత్రమే నమోదు చేశాడు. అంబటి రాయుడు స్ట్రైక్ రేట్ 126.18 అయినప్పటికీ వాళ్లను ఆయా జట్లు కొనసాగిస్తున్నాయి. కానీ మనీశ్​ ను మాత్రం ఎస్​ ఆర్​ హెచ్​ వదులుకోవాలని చూస్తుండటం  గమనార్హం.
Tags:    

Similar News