పాక్ లోని కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను దాయాది పాక్ దేశం ఆహ్వానించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మన్మోహన్ వెళ్లరన్న దానికి భిన్నంగా.. ఆయన వెళతారన్న సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడున్న ఉద్రిక్తతల వేళ.. దాయాది దేశానికి మన్మోహన్ వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నోళ్లు లేకపోలేదు.
ఆర్టికల్ 370 నిర్వీర్యం.. తదనంతరం పాకిస్తాన్ విషం చిమ్ముతున్న వేళ.. మాజీ ప్రధాని హోదాలో మన్మోహన్ ఆ దేశానికి వెళ్లటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మన్మోహన్ మాజీ ప్రధాని హోదాలో కాకుండా సామాన్య భక్తుడి హోదాలో పాక్ కు వెళతారన్న మాట వినిపిస్తోంది.
మాజీ ప్రధాని హోదాలో వెళ్లినా.. సామాన్యుడిలా వెళ్లినా.. మన్మోహన్ కు చేయాల్సిన ఏర్పాట్లను చేయకుండా ఉండరు. మనం ఎలా అనుకున్నా పాక్ చేసే ప్రచారాలు వేరుగా ఉంటాయన్నది మర్చిపోకూడదు. తాజాగా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మన్మోహన్ పాక్ కు వెళ్లకుండా ఉంటేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే.. మన్మోహన్ టూర్ ప్లాన్ మాత్రం వేరేలా ఉందంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో సహా తొలి విడత సందర్శించుకునే భక్తులతో కలిసి వెళ్లే ఈ ఇద్దరు ప్రముఖులు.. అదే రోజు రిటర్న్ అవుతారంటున్నారు. భారత్.. పాక్ లు సంయుక్తంగా నిర్మించిన దర్బార్ సాహిబాను సందర్శించుకునే విషయంలో భారత ప్రముఖులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పక తప్పదు.