కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఇప్పటి వరకు సుమారుగా 13 లక్షలమందికి పైగా ఈ కరోనా వైరస్ సోకింది. వేలాదిగా జనం కరోనా భారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలలో వృద్దులకు కరోనా సోకితే చికిత్స కూడా చేయడం లేదు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఓ 82 ఏళ్ల వయోవృద్ధుడు కరోనా వైరస్‌ను జయించారు. ఆయన పేరు మన్మోహన్ సింగ్.
కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా దేశ రాజధానిలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సమయంలో ఆయన విదేశాల్లో పర్యటించి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన కొద్దిరోజుల తరువాత మన్మోహన్ సింగ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా సోకింది అని తేలింది. దీనితో ఐసొలేషన్‌లో ఆయనకు చికిత్స అందించారు. తాజాగా అయన కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. మరో రెండు రోజుల తరువాత హాస్పిటల్ నుండి డీఛార్జ్ చేయబోతున్నట్టు డాక్టర్లు తెలిపారు.
82 సంవత్సరాల వయస్సులో మన్మోహన్ సింగ్.. ప్రాణాంతక కరనా వైరస్ బారి నుంచి కోలుకోవడం గొప్ప విషయమని, తాము అందించిన వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందించిన తీరు అద్భుతమని, వయోధిక వృద్ధులకు వైద్యం అందించకుండా నిరాకరిస్తున్నామనే విషయం సరైంది కాదని డాక్టర్లు తెలిపారు. వయోభేదం లేకుండా తాము ప్రతి ఒక్కరికీ వైద్యాన్ని అందిస్తున్నామని, దానికి నిదర్శన మన్మోహన్ సింగే నని చెప్పారు. కొన్ని చోట్ల వృద్దులకు వైద్యం చేయడం లేదు అనేది వాస్తవమే అని , అది మంచి పద్దతి కాదు అని, దాన్ని మార్చుకోవాలని వారు కోరారు.