దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నెలరోజులకు పైగా పోరాడుతున్నారు. మోడీ సర్కార్ తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో తీవ్రంగా ఉన్న చలిని సైతం లెక్కచేయకుండా ఆందోళన చేస్తున్నారు. పలువురు రైతుల ప్రాణాలు పోతున్నా లెక్కచేయడం లేదు.
ఈ క్రమంలోనే రైతులకు మద్దతుగా తాజాగా మావోయిస్టులు తమ మద్దతును ప్రకటించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సీపీఐ మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిషా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ లేఖను విడుదల చేసింది.
ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో విడుదలైన లేఖలో దేశం మోడీ వల్లే వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆరోపించారు. మోడీ 10 సూత్రాల కార్యక్రమం బూటకమని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రైతులను కాంట్రాక్ట్ వ్యవసాయం వైపు నెట్టివేస్తున్నాయని అన్నారు. ఇది కార్పొరేట్ పెద్దలకు ప్రయోజనం చేకూర్చేవిగా ఉన్నాయని.. దేశ వ్యవసాయ రంగానికి పెద్ద ముప్పుగా మారుతోందని మావోయిస్టులు ఆరోపించారు.
వ్యవసాయ చట్టాలపై చేసిన ఉద్యమంలో మరణించిన 40మంది రైతులకు మావోయిస్టు పార్టీ నివాళులర్పించింది. వ్యవసాయ సమస్యలపై ఆత్మహత్యలు పరిష్కారం కాదని.. రుణమాఫీ, కనీస మద్దతు ధర (ఎంఎస్.పీ) , స్వామి నాథన్ కమిషన్ సిఫారసుల అమలు కూడా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వదు అని మావోయిస్టు పార్టీ కార్యదర్శి అన్నారు.