మరాఠీలోనే మాట్లాడాలి అని షాప్ ముందే ధర్నాకి దిగిన రచయిత్రి !
భాషాభిమానం ఉండటం ఏ మాత్రం తప్పుకాదు. ఎందుకు అంటే తమ ప్రనటంలో తమ భాష మాట్లాడకుండా ఇంకో భాష మాట్లాడటం దేనికి అనుకోవచ్చు. అయితే , అందరికి ఆ భాష వచ్చి ఉండాలి,అక్కడ ఉండే అందరూ అదే భాషలో మాట్లాడి అంటేనే కొంచెం కష్టం. ఇక మరాఠీవాళ్లకు భాషాభిమానం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముంబాయి మహానగరంలో అయితే పనిగట్టుకుని మరీ మరాఠీ మాట్లాడుతుంటారు. అందులో తప్పులేదు. మహారాష్ట్రలో మామూలువారికే భాషాభిమానం ఎక్కువైతే, మరాఠీ రచయిత్రి శోభా దేశ్ పాండేకు ఇంకెంత ఉండాలి అదే ఆమెను ఓ షాపు ముందు ఆందోళన చేసేలా చేసింది.
రచయిత్రి ఏంటి షాప్ ముందు ఆందోలన చేయడం ఏంటి అనుకుంటున్నారా ! పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఆ షాపు యజమాని మరాఠీ మాట్లాడకపోవమే. మొన్న ఆమె కొలాబాలోని మహావీర్ జ్యువెలరీ షాపుకెళ్లారు. ఆ షాపులోని వ్యక్తి హిందీలోనే మాట్లాడుతుండటం శోభకు నచ్చలేదు. మరాఠీలో మాట్లాడమని చెప్పి చూశారు. ఆయన వినలేదు. మరాఠీలోనే మాట్లాడాలి అని ఆమె పట్టుబట్టారు. ఆమె సతాయింపులు భరించలేక పోలీసులకు ఫోన్ చేశాడా యజమాని, పోలీసులు వచ్చి ఆమెకు సర్ది చెప్పి షాపు నుంచి బయటకు తీసుకెళ్లారు. దీనిత ఆమె షాపు ముందే బైఠాయించారు. ఆందోళనకు దిగారు.
ఈ విషయం నవనిర్మాణ సేనకు తెలిసింది. వెంటనే ఆ పార్టీ నాయకుడు సందీప్ దేశ్ పాండే అక్కడికి వచ్చారు. ఆందోళనలో తనూ భాగం పంచుకున్నారు. 20 గంటల పాటు ఆందోళన సాగింది. ఆ తర్వాత అక్కడికి షాపు యజమాని వచ్చారు. ఆమెకు క్షమాపణ చెప్పి తీరాలంటూ నవ నిర్మాణ సేన పట్టుబట్టింది. దాంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.ఎమ్ ఎన్ ఎస్ కు చెందిన ఓ కార్యకర్త అయితే యజమానిపై చేయి కూడా చేసుకున్నాడు. దీనితో ఇదంతా దేనికి అనుకోని ఆ షాపు యజమాని శోభా దేశ్ పాండే కు సారీ చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.