పోర్చుగల్ దేశంలో సరైన సమయంలో వైద్యం అందక భారతదేశానికి చెందిన ఒక గర్భిణి మృతి చెందడం ఆ దేశ ప్రభుత్వాన్ని తలదించుకునేలా చేసింది. కరోనా పేరిట అత్యవసర ప్రసూతి సేవలను నిలిపివేయడమే గర్భిణి మృతికి కారణం కావడంతో దేశమంతా భగ్గుమన్నది.
అందరూ ప్రభుత్వంపై మండిపడడంతో దెబ్బకు పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. ఇదే టెమిడో కరోనా టైంలో అందరికీ వ్యాక్సిన్లు వేయించి మంచి మంత్రిగా గుర్తింపు పొందాడు.ఇప్పుడు భారతీయ గర్భిణి మృతితో ఉన్న పదవి పోగొట్టుకున్నాడు.
గర్భంతో ఉన్న భారత పర్యాటకురాలు సరైన వైద్యం అందక గుండెపోటుతో మరణించడం పోర్చుగల్ లో సంచలనమైంది. ఆమె మరణానికి వైద్యం నిర్లక్ష్యమే కారణమని తేలింది. దీంతో దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.
పోర్చుగల్ రాజధాని లిస్బన్ లోని శాంటియా మారియో ఆస్పత్రిలో నియోనాటాలజీ విభాగం గర్భణికులతో కిక్కిరిసిపోయింది. ఈ టైంలోనే 34 ఏళ్ల భారతీయ గర్భిణికి చికిత్స అందించలేక అంబులెన్స్ లో మరో ఆస్పత్రికి తరలించారు. పలు ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. దీంతో ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. దీంతో అత్యవసరంగా సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.
లిస్బన్ లో వైద్యం అందక మృతిచెందిన ఘటనకు బాధ్యత వహిస్తూ భారత పర్యాటకురాలి మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆరోగ్య మంత్రి మార్టా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య మంత్రి రాజీనామాను ప్రధాని అంటోనియో కోస్టా ఆమోదించారు.
కరోనా మరోసారి దేశంలో విస్తరించడంతో వైద్యులు అందుబాటులో లేక అత్యవసర ప్రసూతి సేవలను నిలిపివేయాలని మంత్రి టెమిడో నిర్ణయించారు. ఆమె నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆస్పత్రుల్లో ప్రసూతి సేవలు నిలిపివేయడంతో గర్భిణులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఈక్రమంలోనే భారతీయ గర్భిణి ప్రాణాలు పోవడంతో దేశమంతా భగ్గుమన్నది. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.