రూ.5వేల నోటు ధ‌ర 30 ల‌క్ష‌లు!

Update: 2016-11-14 04:33 GMT
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత  ఒక‌టుంది క‌దా. నిజంగా అది అచ్చి గుద్దిన‌ట్లు స‌రిపోయే సంద‌ర్భం ఇది. రూ.500. రూ.1000 నోట్ల ర‌ద్దుతో జ‌రుగుతున్న చిత్రాలు ఒక‌వైపు తెర‌మీద‌కు వ‌స్తుంటే...మ‌రోవైపు దాదాపు 40 ఏళ్ల క్రితం విడుద‌ల చేసిన నోటుకు ప‌లుకుతున్న ధ‌ర ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదంతా రూ. 5వేల నోటుకు 30ల‌క్ష‌ల పెట్టి అయిన కొనుక్కునే ప‌రిస్థితి ఉండ‌టం గురించి.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో... దాదాపు అంద‌రి ఇళ్ల‌లోనూ రూ.1000 - రూ.500 ఉన్నాయి. ఇలా ఉండ‌టం వ‌ల్లే పెద్ద నోట్ల ర‌ద్దుతో క‌ల‌క‌లం రేగుతోంది. అయితే 1978లో ప‌రిస్థితి వేరు. ఆర్థికంగా ఇంత డ‌బ్బు చెలామ‌ణిలో లేదు. పెద్ద నోట్లు క‌లిగిఉన్న దొర‌బాబులు కొంద‌రే. అయిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లోనే రూ.1000 - రూ.5000 రూ.10వేల నోట్లు ఉండేవి. అవి స‌హ‌జంగానే కొంద‌రి ఇళ్ల‌లోనే ఉండేవి. కార‌ణాలు ఏవైనా అప్పుడు ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ దేశంలో తొలిసారిగా నగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. దీంతో అప్పటిదాకా అమలులో ఉన్న నోట్లన్ని చిత్తుకాగితాల‌తో స‌మానం అయ్యాయి.. ఆ స‌మ‌యంలో ఆ పెద్ద నగదు నోట్లను తీపిగుర్తుల కింద కొంద‌రు భ‌ద్ర‌ప‌రుచుకున్నారు. తాజాగా వ‌చ్చిన క్రేజ్‌ లో భాగంగా వాటిని వేలం వేస్తున్నారు. ఇలా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో మరుధర్ ఆర్ట్స్ అనే వేలం కేంద్రంలో 1978 ర‌ద్ద‌యిన నాటి రూ.1000 - రూ.5000 - రూ.10,000 నోట్ల‌ను వేలానికి ఉంచారు. ఈ వేలానికి పెద్ద ఎత్తున స్పంద‌న రావ‌డం గ‌మనార్హం. అప్పటి వెయ్యి రూపాయల నోటు ప్రస్తుత వేలంలో రూ.2.4లక్షల ధర పలుకుతోందంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.  ఇక రూ.5వేలు - రూ.10వేల నోట్లకు కూడా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుంద‌ని స‌దరు వేలం దారులు పేర్కొంటున్నారు. ఆ రెంటిని వేలంలో ఉంచిన‌ట్లు ప్ర‌క‌టిస్తే ప్ర‌స్తుత క్రేజ్‌ను చూస్తే రూ.30లక్షలు మించి రావ‌చ్చ‌ని మ‌రుధ‌ర్ ఆర్ట్స్ వారు ధీమాగా చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News