అంతరిక్షంలో ఎన్నోగ్రహాలు.. పాలపుంతలు.. నక్షత్రాలు ఉన్నాయి. వాటిపై ఎన్నో ప్రయోగాలు.. పరిశోధనలు మానవులు చేస్తున్నారు. అంతరిక్షం అనేది అంతుచిక్కని రహాస్యాల గని. తాజాగా అంతరిక్షం నుంచి భూమికి ఓ ప్రమాదం పొంచి ఉంది. ఆకాశంలో నుంచి ఓ పెద్ద వస్తువు భూమిపై పడనుంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతున్నదని, దాంతో అపార నష్టం సంభవిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 1వ తేదీన మన కాలమానం ప్రకారం ఉదయం 10.49 గంటలకు 2011 ES4 అనే గ్రహ శకలం భూమికి దగ్గర్నుంచి వెళ్తుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది. ఎక్కువ దూరం నుంచేమీ కాదు.. 44,618 మైళ్ల దూరం నుంచే ఆ గ్రహశకలం వెళ్తుందని వివరించింది. చాలా గ్రహశకలాలు భూమి వైపు నుంచి చాలా వెళ్లాయి కానీ.. భూమికి కాని, భూమ్మీద నివసిస్తున్న జీవరాశులకు కాని ఎలాంటి నష్టం చేయలేదు. అయితే ఇప్పుడు భూమిపై పడే గ్రహ శకలం ద్వారా పెద్ద ఎత్తున నష్టం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
2011 ES4 గ్రహశకలం వల్ల ఎలాంటి నష్టం జరగదని నాసా ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. మిగతా గ్రహ శకలాలు చంద్రుని కంటే దూరంగా వెళ్లాయి.. మనకు చంద్రుడు 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. ఈ గ్రహశకలం మాత్రం చంద్రుడి కంటే దగ్గర నుంచి భూమి మీదుగా వెళ్లబోతున్నదని తెలిసింది. చంద్రుడి కంటే దగ్గర భూమి వైపు నుంచి వెళుతుండడంతో ఈ గ్రహశకలాన్ని భూమి ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉండటం కారణంగా చెబుతున్నారు.
భూమికి దగ్గరగా వచ్చే యాస్టిరాయిడ్స్‌ను నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ గా పేర్కొంటారు. ఇవి తమ మార్గంలోనే పయనిస్తూ మధ్యలో ఏదైనా గ్రహం వస్తే దాని గురుత్వాకర్షణశక్తికి లోనవుతాయి. దీంతో తమ దిశ మార్చుకుని గురుత్వాకర్షణ శక్తికి లోనైన గ్రహం వైపుకు వెళతాయి. చంద్రుడు భూమి గురుత్వాకర్షణకు లోబడే ఉండడంతో గ్రహ శకలం చంద్రుడి కంటే దగ్గరగా భూమి నుంచి వెళితే సాధారణంగా భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనవుతుంది. ఇది జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 2011 ES4 గ్రహశకలం అంగారక, గురు గ్రహాల మధ్య ఉండే గ్రహశకలాలలో ఒకటి కావొచ్చంటూ నాసా భావిస్తోంది.