గనుల రాజుగా పేరున్న కన్నడ పొలిటీషియన్ గాలి జనార్దనరెడ్డి కూతురి పెళ్లికి సకల ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. భారత్ లో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఇదొకటిగా నిలవనుంది. గాలి కుమార్తె బ్రాహ్మణి పెళ్లి గురించి ఇప్పటికే ఎంతో ప్రచారం జరిగింది. పెళ్లి కార్డుతోనే గాలి జనార్దనరెడ్డి తన ప్రత్యేకత ఏమిటో చాటుకున్నారు. ఇప్పుడు బెంగుళూరు పేలస్‌లో జరగబోయే ఈ పెళ్లి చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటున్నారు.
వివాహ వేడుక కోసం ఏర్పాటు చేస్తున్న వేదికకే కోట్లు ఖర్చవుతోందట. సినిమా స్టయిల్‌లో వెడ్డింగ్ సెట్స్‌ని డిజైన్ చేశారు. బాజీరావ్ మస్తానీ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్లు సుజీత్ సువాత్ - శ్రీరామ్ అయ్యంగర్ దీనికి వర్క్ చేస్తున్నారు. విజయనగర రాజ్యం కట్టడాల నమూనాలో ఈ సెట్టింగులు వున్నాయి.
పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల వద్ద ఎవరూ ఫోటోలు తీసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ పెళ్లికి పదుల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు.
- 5 లక్షల మంది ఈ ఫంక్షన్‌కి హాజరు కానున్నారట.
- వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు - అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పనిచేసే గ్రౌండ్ స్టాఫ్ లక్షమంది.
- 2500 మంది సూపర్ వైజర్లు - 1000 మంది మేనేజర్లని నియమించారు.
- కొందరు ఈ పెళ్లి ఖర్చు 150 కోట్లు అంటుంటే ఇంకొందరు మూడొందల కోట్లు అంటున్నారు. అయితే ఇండియాలో ఇంతవరకు ఏ పెళ్లి ఖర్చు వంద కోట్లు మించలేదంటారు మరి ఈ కచ్చితమైన వివరాలు బయటకు ఎపుడు వస్తాయో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/