రష్యాలో మాస్టర్, వీసా కార్డులకు చెక్..: ఇక అవి పనిచేయవు

Update: 2022-03-06 06:56 GMT
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరగుతున్న యుద్ధంతో యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు తీవ్రతరం చేశాయి. రష్యాకు సంబంధించిన అన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నాయి.  ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో రష్యాతో తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు కొన్ని కంపెనీలు ప్రకటిస్తున్నాయి.

యుద్ధం ప్రారంభం తొలి రోజు నుంచే ఆంక్షలు విధిస్తున్నట్లు యూరోపియన్ కంపెనీలు ప్రకటించాయి. తాజాగా ఈ ఆంక్షలు మరింత తీవ్రమైనట్లు తెలుస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు రష్యాపై అనేక రకాల ఆర్థిక వ్యవహారాలను కట్ చేశాయి. తాజాగా ఈ లిస్టులో ఇటలీ కూడా చేసింది. యూరోపియన్ యూనియన్ లో ఉన్న ఇటలీ ఇప్పటి వరకు రష్యా విషయంలో ఆంక్షలు ప్రకటించలేదు. తాజాగా ఇటలీ తో పాటు సింగ పూర్ కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపాయి.

ఈ మేరకు రష్యా ఒలిగార్స్ కు చెందిన అకౌంట్లన్నీ సీజ్ చేయాలని బాంక్ ఆఫ్ ఇటలీలకు ఆదేశాలు వెళ్లాయి. సాధ్యమైనంత వరకు వారి బ్యాంకు అకౌంట్లన్నీ స్తంభింపజేయాలని ఆదేశించింది. అటు సింగపూర్ సైతం తాజాగా ఆంక్షలను కఠినం చేసింది. ఉక్రెయిన్ కు నష్టం కలిగించే ఆయుధాలను సరఫరా చేయబోమని సింగపూర్ స్పష్టం చేసింది.

ఆయుధాలతో పాటు సైబర్ కార్యకలాపాల్లోనూ రష్యాకు సాయం చేయమని తెలిపింది. సైనికులు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, టెలి కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబితాలో ఉన్న వస్తువులన్నింటిపైనా తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.

ఇక డిజిటిల్ పేయింగ్ పేపాల్ సర్వీస్ కూడా తన సేవలన్నీ రష్యాలో నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తమ కంపెనీకి సంబంధించిన సర్వీసులు కొంతకాలం ఉండవని పేర్కొంది. పేపాల్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఈ విషయంపై మాట్లాడుతూ రష్యా దాడులకు పాల్పడడాన్ని తాము సమర్థించలేమని, రష్యాకు వ్యతిరేకంగా నిలిచిన సమాజానికి తాము కలిసివస్తామని పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డయాన్స్ షుల్మన్ తెలిపారు. పేపాల్ మాత్రమే కాకుండా మాస్టర్ కార్డ్, వీసా కార్డులు కూడా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ రెండు సంస్థలు రష్యాలో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి.

రష్యా బ్యాంకులు జారీ చేసిన విసా, మాస్టర్ కార్డలేవి పనిచేయవని స్పష్టం చేశాయి. తమ నెట్ వర్క్స్ లెంతో కాలం పాటు అందుబాటులో ఉండవని తెలిపాయి. దీంతో రష్యా స్టోర్స్, ఏటీఎంలలో ఈ కార్డుల ద్వారా మనీని పొందేందుకు ఆంక్షలు ఏర్పడ్డాయి.

అయితే ఈ నిర్ణయం తేలిగ్గా తీసుకోలేదని ఎన్నో చర్చల తరువాత ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయా సంస్థల యజమానులు తెలిపారు. రష్యాపై ఆంక్షల విషయంలో వినియోగదాులు, భాగస్వామ్య కంపెనీలు, స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వాలను సంప్రదించిన తరువాత ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపాయి.

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడి సమర్థనీయం కాదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వీసా చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్ కెల్లి తెలిపారు. కాగా మాస్టర్,వీసా రెండు కంపెనీలు కొద్దినిమిషాల తేడాతోనే ఈ ఆంక్షలు ప్రకటించడం గమనార్హం. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా సెనెటర్లతో సంప్రదింపులు జరిపినట్లు కాపిఫోర్నియాకు చెందిన డెమొక్రాటిక్ యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ తెలిపారు.
Tags:    

Similar News