మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ ప్రజలు తమ కాలనీ సమస్యలపై ఈనెల 28న ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ సదుపాయం లేదని, రోడ్లు అధ్వాన్నంగా మారాయని, అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారంటూ కాలనీ వాసులు మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆయన కాలనీవాసులకు సమాధానమిస్తుండగా వీడియో రికార్డయ్యింది. ఇందులో ఆయన ‘‘ జవహర్ నగర్లో విద్యుత్ స్తంభాలు లేవని నాకు తెలుసు.. రాత్రివేళ్లల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుసు.. ఇలా అక్రమాలకు పాల్పడుతుంది ఎవరో కాదు మన నేతలే అన్న సంగతి కూడా తెలుసుని.. అందరూ దొంగలే.. భూకబ్జాలకు పాల్పడుతుందని మన నేతలే’ అంటూ బాంబు పేల్చారు. ఈ వీడియో ఇప్పడు వైరల్ మారుతుంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయనపై మిశ్రమ కామెంట్లు చేస్తున్నారు. మల్లారెడ్డి మాటలను టిక్ టాక్ లో పెట్టి వైరల్ చేస్తున్నారు. దీనిపై ఓ విలేకరి ఆయనను ప్రశ్నించగా ఆయన తాను అలా అనేదని చెప్పారు. భూకబ్జాలకు పాల్పడుతుంది మా నాయకులు కాదని కొందరు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారని వివరణ ఇచ్చారు. ఎవరైతే ఈ నిర్మాణాలు కొంటారో తరువాత బాధపడాల్సి వస్తుందని సూచిస్తున్నానన్నారు. త్వరలోనే కలెక్టర్ కార్యాలయం వారు అక్కడి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారని ఎవరూ కూడా వాటిని కొనుగోలు చేసిన నష్టపోవద్దని సూచించారు.
మల్లారెడ్డి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడంతోపాటు ఆయన తన వద్దకు ఏ సమస్య వచ్చి సహాయం అడిగిన సాయం చేసేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారు. ఏదిఏమైనా మల్లారెడ్డి లాంటి నేతలు రాజకీయాల్లో ఇలా ఉంటూ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి.