బీజేపీ ఓడిపోతుంటే మీడియాను అనుమ‌తించ‌రా?

Update: 2018-03-14 08:55 GMT
కొన్ని త‌ప్పులు అస్స‌లు చేయ‌కూడ‌దు. కానీ.. వ‌ప‌ర్ లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తోంది. ప్ర‌జాస్వామ్య భార‌తంలో దేనినైనా క్ష‌మిస్తారు కానీ.. అహంభావాన్ని అస్స‌లు త‌ట్టుకోలేరు. ఇక‌.. ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని తొక్కిపెట్టే ధోర‌ణిని స‌హించ‌లేరు. అలాంటి ప్ర‌య‌త్నం చేసిన వారికి ప్ర‌జాకోర్టులో విధించే శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని క‌మ‌ల‌నాథులు మ‌ర్చిపోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే త‌మ పాట‌న‌లో ప‌లు రాష్ట్రాల‌ను ర‌గిలిపోయేలా చేస్తున్న మోడీ స‌ర్కారు.. త‌మ మాట‌లతో.. చేత‌ల‌తో మ‌రింత మంట పుట్టేలా చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోపాల‌న‌పై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఉప ఎన్నిక‌లు జ‌రిగి. ఫ‌లితాలు వెలువ‌డుతున్న యూపీ.. బిహార్ లో ప‌రిస్థితిపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

అన్నింటికి మించి యూపీలో జ‌రిగిన రెండు లోక్ స‌భ స్థానాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీకి ఎదురుగాలి వీయ‌టం.. విప‌క్ష స‌మాజ్ వాది పార్టీ విజ‌యం సాధించే దిశ‌గా ప‌య‌నిస్తున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ఇప్ప‌టికే జాతీయ మీడియా విశేష ప్రాధాన్య‌త‌ను ఇస్తూ వార్త‌లు ఇస్తున్నాయి. ఇదిలాఉంటే.. యూపీ ముఖ్య‌మంత్రి యోగికి చెందిన గోర‌ఖ్ పూర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ వెనుక‌బ‌డి ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఇక్క‌డి కౌంటింగ్ కేంద్రాల‌కు మీడియాను అనుమతించ‌క‌పోవ‌టంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఉప ఎన్నిక‌ల ఫలితాలు బ‌య‌ట‌కు వ‌స్తున్న కాసేప‌టికే.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వ‌ద్ద‌కు మీడియాను అనుమ‌తించ‌క‌పోవ‌టంపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. గోరఖ్ పూర్ కౌంటింగ్ కేంద్రం ద‌గ్గ‌ర బీజేపీ అభ్య‌ర్థి వెనుక‌బ‌డి ఉన్నారంటూ రౌండ్ల లెక్కింపు ఫ‌లితాలు వెలువ‌డుతున్న స‌మ‌యంలోనే మీడియాను అక్క‌డి నుంచి పంపించివేయ‌టంపై విప‌క్ష స‌మాజ్ వాదీపార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న చేప‌ట్టింది. ఇదే అంశంపై పార్ల‌మెంటులోనూ ఎస్పీ నేత‌లు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చే్స్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం.. బీజేపీ అభ్య‌ర్థులు ఇద్ద‌రు భారీ ఎత్తున వెనుక‌బ‌డి ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గోర‌ఖ్ పూర్ కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద మీడియాను బ్యాన్ చేయ‌టంతో అక్క‌డి ఫ‌లితంపై వివ‌రాలు అంద‌టం లేదు. మ‌రోవైపు ఫుల్పూర్ ఉప ఎన్నిక‌ల్లో 15వేల ఓట్ల‌కు పైచిలుకు అధిక్య‌త‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రిన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది.
Tags:    

Similar News