మర్యాదగా వార్నింగ్ ఇవ్వటం ఎక్కడైనా చూశారా? చూసి ఉంటే ఫర్లేదు. ఒకవేళ చూడలేదంటే.. ఏపీలో జరుగుతున్న కోడి పందాలు జరుగుతున్న దగ్గరకు మీడియా వారు వెళితే.. విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. మర్యాదకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే గోదావరి జిల్లాల్లో తాజాగా నెలకొన్న పరిస్థితుల కారణంగా మీడియా వారికి చాలాచోట్ల ఎంట్రీ దొరకటం లేదు. ఎందుకైనా మంచిదన్న భావనతో.. ముందుజాగ్రత్తగా కొన్ని చోట్ల మీడియాను అస్సలు అనుమతించటం లేదు.
ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయటంతో పాటు.. పెద్ద మనుషులు మీడియా ప్రతినిధులకు మర్యాదగా.. కోడి పందాల వ్యవహారాన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి వెనక్కి పంపుతున్నారు. కొన్నిచోట్ల అయితే.. వ్యక్తిగతంగా పోటీలు చూసేందుకు వస్తే తమకు అభ్యంతరం లేదని.. వృత్తిపరంగా వద్దని సున్నితంగా చెప్పి పంపిస్తున్నారు. ఏది ఏమైనా మర్యాదగా వార్నింగ్ ఇస్తున్న తీరుతో మీడియా ప్రతినిధులు ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.