మీడియా - విశ్వసనీయత.. వాస్తవమెంత?

Update: 2020-02-22 17:30 GMT
పార్టీకో పత్రిక - చానెల్.. అవే టాప్ చానళ్లు.. ఇక ఏదైనా టాప్ లోకి వెళ్లినా ఆ చానెల్ ను నేతలు కొనేస్తున్నారు. పత్రికను ఆక్యూపై చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పార్టీలతో సంబంధం లేని మీడియా ఒకటి అరా తప్పితే లేవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.. ఈ పరిణామం మీడియా విశ్వసనీయతకు పెద్ద దెబ్బగా పరిణమిస్తోంది. అయితే తాజాగా మీడియా తీరు మారింది.  మీడియా ప్రస్తుతం ప్రజల పక్షంగా ఉన్నట్టు కథనాలు ప్రచురిస్తోంది. ఈ పరిణామం కొందరిని అవాక్కయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపుపై మీడియాలో వచ్చే కథనాలు మీడియా విశ్వసనీయత - విలువలపై పలు ప్రశ్నలను రెకెత్తిస్తోంది. మీడియా తనకు అవసరమైనపుడే ప్రజా కోణంలో వార్తలు రాస్తుందా? అన్న ప్రశ్న తలెత్తకమానదు. మీడియాకు అండగా ఉన్న కార్పొరేట్ శక్తులు అందలమెక్కినపుడు ప్రజా సమస్యలు గుర్తుకు రావా? అనే సందేహాలు లెవనెత్తుతోంది.

ఏపీలో జరుగుతున్న పరిణామలపై అక్కడి పత్రికలు ‘రాజధాని గుండె పగిలింది..’ -  ‘రాజధాని అక్రమాలపై సిట్’ - ఇళ్ల స్థలాల కోసం ‘అసైన్డ్ భూములు గుంజుకుంటున్న వైనం’  - ‘రాత్రికి రాత్రే దున్నేశారు’ అంటూ పెద్దపెద్ద హెడ్డింగ్ లతో ప్రచురించాయి. ఈ మీడియా విశ్వనీయతపైనే ఓ ప్రముఖ ఆంగ్ల ప్రతిక ‘విశ్వనీయత కొల్పోతున్న మీడియా - దిగజారుతున్న విలువలు’ అంటూ తాజాగా పెద్దగా ఓ వ్యాసం ప్రచురించింది. ప్రస్తుతం ఈ కథనం వైరల్ అవుతోంది. మీడియా తీరుపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీడియాకు ఇన్నిరోజులు కన్పించని అమరావతి రాజధాని సమస్యలు ఒక్కసారిగా తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు. మీడియాకు తమకు అనుకూలమైన పాలకవర్గం అధికారంలో లేనపుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మీడియా ఉన్నది ప్రజలను చైతన్యవంతం చేయడానికే అన్నట్లుగా పుంఖాలుపుంఖాలుగా వార్తలను ప్రచురించాలి. మీడియా ప్రవర్తిస్తున్న తీరుకు ప్రజలు అవాక్కవుతున్నారు. ‘రాజధాని గుండె పగిలింది’ ఎన్ని పేజీల వార్తలు రాసినా అవి ‘రాజధాని’ సమస్యలేగానీ ప్రజా సమస్యలు అవుతాయా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రైతులు ఈ ప్రాంతం నుంచి తరలివెళ్లినప్పుడు పట్టించుకోని మీడియా ప్రస్తుతం రైతులు పస్తులుంటున్నారని పెద్ద పెద్ద శిర్షీకలతో ప్రచురిస్తుండటంతో వాళ్లంతా అవాక్కవుతున్నారు. ఏనాడూ ఈ ప్రాంత రైతులు - కౌలు రైతులు - ట్రాక్టర్ డ్రైవర్లు - కూలీలు - పాలేర్ల సమస్యలపై పట్టించుకోని మీడియా నేడు మీ సమస్యలు మావే అన్నట్లు కథనాలు ప్రచురిస్తుండటంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

వాస్తవానికి ఇక్కడి ప్రాంత ప్రజలు తమ భూములను అమ్ముకొని ఏనాడో పక్క జిల్లా ప్రాంతాలైన ప్రకాశం - గిద్దలూరు - మార్కాపురం -  కంభం వైపు తరలివెళ్లారు. అక్కడే భూములను కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతు మట్టిని నమ్ముకొని జీవిస్తాడుగానీ రాజధాని ప్రాంతాన్ని కాదనేది మీడియాకు తెలువకపోవడం శోచనీయంగా మారింది. ప్రస్తుతం మీడియా ఇందుకు రాజధాని భూముల విషయంలో ఇంత గగ్గోలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమి లేదు. విశ్వనీయత కొల్పోయిన మీడియాను ప్రజలు ఏనాడో పట్టించుకోవడం మరిచిపోయారు అన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా మీడియా ప్రతినిధులు తమకు అవసరమైనప్పుడు ప్రజలపై ప్రేమ చూపడంమాని వాస్తవ పరిస్థితులను తెలియజేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News