సింఫుల్ గా చెప్పాలంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ప్రత్యేక సమావేశ మందిరంలో ఆరు గంటల పాటు మాట్లాడుకోవటమంటే మాటలు కాదు. ఇరువురు ముఖ్యమంత్రులు తామేం మాట్లాడుకున్నామన్న విషయాన్ని ఎవరికి చెప్పుకుంటారన్న గ్యారెంటీ లేదు. ఎవరికి వారికి సొంత మీడియా సంస్థలు ఉన్నప్పటికీ ఏకాంత భేటీలో ఏం జరిగిందన్న విషయాన్ని బయటకు పెట్టే ఛాన్స్ లేదు. ఈ లెక్కన వీరిద్దరూ పెదవి విప్పకుండా ఏం జరిగిందో తెలుసుకోవటం ఎవరి వల్లా సాధ్యం కాదు. కానీ.. అధికారికంగా వారిద్దరూ మీడియాతో మాట్లాడుకున్నా.. వారు మాట్లాడుకున్న అంశాలకు సంబంధించిన ఒక ప్రెస్ నోట్ అన్ని మీడియా సంస్థలకు వెళ్లింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఇద్దరు అగ్రనేతలకు చెందిన మీడియా సంస్థల్లో వీరి మధ్య జరిగిన భేటీ గురించి ఏమేం చెప్పారన్నది ప్రాతిపదికగా తీసుకోవటం మంచిది. ఎందుకంటే.. భేటీలో ఏం జరిగిందన్నది రివీల్ చేయాలన్న ఆలోచన ఇద్దరు సీఎంలకు ఉంటే.. వారు ముందు తమ మీడియా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తారనటంలో ఎలాంటి సందేహం ఉండదని చెప్పక తప్పదు.
ఈ లెక్కన ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సాగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారన్నది రెండు మీడియా సంస్థలు ప్రచురించిన వార్తాంశాల్ని తీసుకుంటే సరిపోతుంది. ఇందులో భాగంగా సాక్షి.. నమస్తే తెలంగాణలో ఈ వార్తకు సంబందించి వారు పేర్కొన్న సమాచారం ఏమంటే..
% అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలి. కృష్ణ నదిలో నీటి లభ్యత విషయంలో ప్రతి ఏడాది అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో గోదావరి జలాల్ని కృష్ణ ఆయుకట్టకు అందించే విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అంగీకారం.
% రాష్ట్ర విభజన చట్టంలోని 9 - 10 షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయటం.
% కృష్ణ నది ఆయుకట్ట కింద ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం.. నెల్లూరుజిల్లాల రైతులు.. తెలంగాణ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. అందుకే పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి జిలాల తరలించి అవసరమైన వేళలో కృష్ణ ఆయుకట్టు రైతులకు ఇవ్వటమే వివేకవంతమైన చర్య.
% ఈ నిర్ణయం ప్రకారం రాయలసీమ.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాలతో పాటు పాలమూరు.. నల్లగొండ.. జిల్లాల వ్యవసాయభూములకు కచ్ఛితంగా నీరు అందుతుంది. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించొచ్చు.
% గోదావరి నీటిని ఎక్కడ నుంచి ఎటు తరించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్ ెలా ఉండాలి? లాంటి అంశాల్ని తదుపరి మీటింగ్ లో చర్చించాలి
% అనవసరమైన పంచాయితీలు తేల్చుకోవాలి. 9 - 10 షెడ్యూళ్లకు సంబంధించి పేర్కొన్న విభజన అంశాల్ని పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలి.