మెగా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముగ్గురు ముగ్గురే అన్న రీతిలో.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఆ మాటకు వస్తే.. ముగ్గురు మంచి కోసం తపిస్తుంటారు. అందుకు వారు ఎంచుకున్న దారులు.. వారు నడిచే రహదారులు వేర్వేరు కావొచ్చు. కానీ.. గమ్యం మాత్రం ఒక్కటే.
తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో ఒక సైనికుడిగా వ్యవహరించే నాగబాబు.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆయన తాజాగా ఫ్యాన్స్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దాదాపు ముప్ఫైకు పైనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినప్పటికీ.. అందులో మూడు ప్రశ్నలకు ఆయన ఆన్సర్లు మాత్రం అదిరాయని చెప్పాలి.
సూటిగా సుత్తి లేకుండా ముఖం పగిలేలా ఇచ్చిన ఆన్సర్లు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్సర్లకు మెగా ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. తన తమ్ముడ్ని అదే పనిగా టార్గెట్ చేసే వారికి తనదైన పంచ్ లు ఇచ్చి.. మెగా బ్రదర్ పంచ్ లు ఎలా ఉంటాయో మాటల్లో చెప్పేశారు. ఏపీలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పుడు చెప్పలేను కానీ 2024లో పవన్ సీఎం కాగానే మాత్రం గ్యారెంటీ వస్తుందని భిన్నంగా చెప్పే ప్రయత్నం చేశారు. పవన్ సీఎం అయితే అన్న ప్రశ్నకు.. కౌలు రైతులు.. రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా చేస్తామన్నారు.
మరో అభిమాని.. ‘‘మన పౌర క్యాసినో మంత్రి గురించి ఒక్క మాట చెప్పండి’’ అంటూ రిక్వెస్టు చేస్తే.. ‘‘మొత్తం నువ్వే చెప్పావ్ కదా బ్రదర్. నేనుచెప్పేది ఏముంది?’’అని బదులిచ్చారు. మిగిలిన ప్రశ్నలకు ఇచ్చిన ఆన్సర్లలో హైలెట్ అయిన రెండింటి గురించి చెప్పాల్సి వస్తే.. ‘ఒక మంత్రి పవన్ కల్యాణ్ గారు అతనితో ఫోటో దిగారని చెప్పుకుంటున్నారు’అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తే.. రియాక్టు అయిన నాగబాబు.. ‘‘అవును బ్రదర్.. కల్యాణ్ కుక్కలు-బర్రెలు-ఆవులు-పందులు-ఇలా చాలా జంతువులతో ఫోటోలు దిగుతారు. కొన్ని జంతువులు చెప్పుకుంటాయి. కొన్ని చెప్పుకోవు అంతే’’ అంటూ నాకౌట్ పంచ్ తరహాలో ఆన్సర్ ఇచ్చారు.
ఒక మహిళ అడిగిన ప్రశ్న ఏపీలోని పరిస్థితితో పాటు.. ఆమె ఎదుర్కొనే సమస్యకు నాగబాబు స్పందించిన తీరుకు మాత్రం ప్రశంసించకుండా ఉండలేం. ‘24 గంటలు కరెంట్ అని చెప్పారు. ప్రతిరోజు కరెంటు పోతుంది. నేను గర్భవతిని. ఆయాసంతో ఇబ్బంది పడుతున్నాను’ అని తన సమస్య గురించి చెప్పుకున్నంతనే రియాక్టు అయిన నాగబాబు.. ‘‘తల్లీ.. మీకు ఏమన్నా సహాయం కావాలంటే నన్ను అడగండి’’ అంటూ బదులిచ్చిన మెగా బ్రదర్ ఆన్సర్.. మిగిలిన రాజకీయ నేతలకు.. తనకున్న తేడాను చెప్పేశారని చెప్పాలి.
తన కొడుకు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘గని’ ప్లాప్ కావటానికి కారణం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. యాక్టింగ్ జర్నీలో హిట్స్.. ప్లాప్స్ సహజమని చెప్పారు. ఏదైనా సినిమాలో విలన్ గా ట్రై చేయొచ్చు కదా అని అడిగితే.. ఎవరైనా అవకాశం ఇవ్వాలిగా అంటూ ఉన్నది ఉన్నట్లుగా ఆన్సర్ ఇచ్చేశారు నాగబాబు.