పవిత్ర అమర్ నాథ్ యాత్ర సందర్భంగా ఉగ్రదాడిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సోమవారం రాత్రి 8.20 నిమిషాలకు కన్ బలీ ప్రాంతంలో అమర్ నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం ఏడు మంది మృతిచెందారు. 32 మంది గాయపడ్డారు. అధికార వర్గాల కథనం ప్రకారం జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారికి సమీపంలోని బటెంగో వద్ద ఈ ఘటన జరిగింది. అమర్ నాథుడిని దర్శించుకుని సోనమార్గ్ గుండా 70 మందికి పైగా యాత్రికులు బస్సులో తిరిగి వస్తుండగా ముష్కరులు దాడి చేశారు. యాత్రికులు ఎలాంటి రిజిస్ట్రేషన్ - భద్రత లేకుండా వెళ్తుండటాన్ని గమనించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా... అమర్ నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ముస్లింలు ఖండిచారు. ప్లకార్డులు పట్టుకుని ముస్లింలు దాడిని ఖండిస్తూ ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు గాయపడ్డవారిని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ పరామర్శించారు. అనంత్ నాగ్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నవారితో ఆమె మాట్లాడారు. `మీరు మా రాష్ట్రానికి వస్తే, మేం ఏం చేశామో చూశారా?` అని ఆమె ఆవేదన భరిత హృదయంతో మాట్లాడారు. `మీ నుంచి నేను క్షమాపణలు కోరుతున్నాను` అని ఆమె బాధితులకు దండాలు పెడుతూ వేడుకున్నారు. యాత్రికులపై ఉగ్రదాడి అది కశ్మీర్ కు - ముస్లింలకు మచ్చ అని ఆమె అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేవారకు తాము మౌనంగా ఉండబోమన్నారు. కన్ బలీ ఘటన పట్ల ప్రతి కశ్మీరీ తన తలను సిగ్గుతో దించుకోవాల్సి వస్తుందన్నారు. యాత్ర కోసం ప్రతిఏడాది భక్తులు వస్తుంటారని, దాడిని ఖండించేందుకు తన వద్ద మాటలు లేవు అని, రాష్ట్ర పోలీసులు ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుంటారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. అమర్ నాథ్ మృతుల్లో ఆరుగురు మహిళలే ఉన్నారు.
మరోవైపు ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం నేడిక్కడ సమావేశమైన ప్రతిపక్ష పార్టీల నేతలు అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా మౌనం పాటించారు.