ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరులో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ... బీజేపీ మైత్రిని వీడిందన్న వాదన లేకపోలేదు. గడచిన నాలుగేళ్లుగా ఏపీకి ఎలాంటి న్యాయం జరగకున్నా కూడా మోదీ సర్కారు ఏపీకి న్యాయం చేస్తోందని, ఇకపైనా చేస్తుందన్న నమ్మకం తనకుందని ప్రకటించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... ఇప్పుడు ఆ మాటలకు పూర్తి విరుద్ధమైన ప్రకటనలు గుప్పిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ భవిష్యత్తులో మళ్లీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోదా? అన్న కోణంలో ఇప్పటికే చాలా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత - నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదన్న విషయాన్ని ఆవిష్కరిస్తూ కాసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దూరమైన చంద్రబాబు... భవిష్యత్తుల్లో మళ్లీ బీజేపీ గ్రాప్ పెరుగుతుందన్న భావన కనిపిస్తే మళ్లీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోరని మేకపాటి ఆరోపించారు.
ఇదేదో తాను ఊహించి చెబుతున్నది కాదని పేర్కొన్న మేకపాటి... గతంలోనూ బీజేపీతో మైత్రి కొనసాగించిన చంద్రబాబు వ్యవహరించిన తీరును పరిశీలించిన తర్వాతే తాను ఈ మాటను చెబుతున్నానని కూడా ప్రకటించారు. బీజేపీతో నాలుగేళ్లుగా సుఖవంతమైన కాపురం చేసిన టీడీపీ... ప్రధాని మోదీ గ్రాఫ్ తగ్గుతోందన్న ఆలోచనతో ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిందని తెలిపారు. వాజ్ పేయి ఉన్నప్పుడే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబుకు... మోదీకి దూరంగా జరగడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. ఒక వేళ మోదీ గ్రాఫ్ పెరుగుతుందని అనిపిస్తే... మళ్లీ బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేందుకు కూడా చంద్రబాబు సిద్ధపడతారని... ఇవన్నీ ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే భావనతో వైసీపీకి చెందిని ఎంతో మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నారని విమర్శించారు. చంద్రబాబులో గొప్ప మేధావితనం ఉందని... దాన్ని ఎవరూ కాదనలేమని మేకపాటి చెప్పారు.
ఇప్పుడు 30వ సారి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని... పార్లమెంటు సెంట్రల్ హాల్ లో పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారని... దాన్ని తాము కూడా చూశామని... అయినా ఎలాంటి ఫలితం రాలేదని మేకపాటి అన్నారు. చంద్రబాబు ఎలాంటి నాయకుడో దేశంలో ఉన్న రాజకీయ నేతలందరికీ తెలుసని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లపాటు నిమ్మకునీరెత్తినట్టు ఉన్న చంద్రబాబు... ఎన్డీయే అన్యాయం చేసిందంటూ, ఇప్పడు మాట్లాడుతుండటం విచిత్రంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడదని చెప్పారు. ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటనే తప్ప, రాష్ట్ర ప్రయోజల కోసం చేస్తున్నది కాదని మేకపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు.