మేక‌పాటికి అస్వ‌స్థ‌త‌..అయినా దీక్ష కొన‌సాగింపు!

Update: 2018-04-07 05:03 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన  75 ఏళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేస్తున్న వైనం తెలిసిందే. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష‌లు తీర్చేందుకు దీక్ష చేస్తున్న ఆయ‌న శ‌నివారం తెల్ల‌వారుజామున అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

తీవ్ర‌మైన క‌డుపునొప్పితో ఆయ‌న విల‌విల‌లాడారు. దీంతో.. ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు.. వెంట‌నే దీక్ష‌ను విర‌మించాల్సిందిగా కోరారు. అయితే..దీక్ష‌ను విర‌మించేందుకు మేక‌పాటి నో చెప్పారు.

 ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం దేనికైనా తాను రెఢీ అన్నారు. ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం సాయంత్రం ఢిల్లీలో చోటు చేసుకున్న పెనుగాలుల కార‌ణంగా ఏపీ భ‌వ‌న్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీక్షా శిబిరం క‌కావిక‌ల‌మైంది. అయిన‌ప్ప‌టికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు త‌మ దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. ఎంపీలు చేస్తున్న దీక్ష‌కు ఢిల్లీలోని తెలుగు సంఘాల వారు సంఘీభావాన్ని వెల్ల‌డించాయి. 75 ఏళ్ల వ‌య‌సులో అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నా వెన‌క్కి త‌గ్గ‌కుండా మేక‌పాటి దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు.
Tags:    

Similar News