ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం మరిన్ని మలుపు తిరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ ఆర్ సీపీ ఎంపీలతో లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టించారు. అవిశ్వాసం పెట్టిన అనంతరం వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలనే కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా పరోక్షంగా పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.
ప్రత్యేక హోదా సాధించేందుకు మడమతిప్పని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు తాము నోటిసు ఇచ్చామని ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో మద్దతు కూడగట్టేందుకు తాను సిద్దమని ఎవరో ప్రకటించారని పేర్కొంటూ...ఇప్పుడు మద్దతివ్వాలని అన్నారు. ` అవిశ్వాసంపై చర్చకు 54 మంది సభ్యుల మద్దతు అవసరం. అవిశ్వాసం పెట్టండి.. 50 మంది ఎంపీల మద్దతు ఇప్పిస్తామని ఎవరో సవాల్ చేశారు. మేం అవిశ్వాసం పెట్టినందున వారు మద్దతు కూడగట్టాలి` అని పరోక్షంగా పవన్ కు తన సవాల్ ను గుర్తు చేశారు.
కాగా, అవిశ్వాసం తీర్మానాన్ని ట్విటర్ ద్వారా వైఎస్ జగన్ వెల్లడించారు. `కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తాం’అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అవిశ్వాస తీర్మానం కోసం ఇచ్చిన నోటీసును కూడా ట్విటర్ లో పోస్ట్ చేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు ఆయన స్వయంగా లేఖలు కూడా రాశారు. ఈ లేఖలను ఎంపీలు ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నాయకులను కలిసి అందజేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమతో కలిసి రావాలని వివిధ రాజకీయ పార్టీలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.