ట్రంప్ - మెలానియా విడాకులు.. సీక్రెట్ రివీల్

Update: 2020-11-09 04:45 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్.. తాను ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదని చెబుతున్నప్పటికీ.. ఆయన పప్పులు ఉడికేలా కనిపించటం లేదు. ఆయన వాదనను సొంత పార్టీ నేతలు సైతం తప్పు పడుతున్నారు. రాజకీయంగా ఆయన కథ ముగిసినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్న వేళ.. మరో షాకింగ్ అంశం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆయనకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగలనున్నట్లుగా డైలీ మొయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

ట్రంప్.. ఆయన సతీమణి మెలానియాకు మధ్య సంబంధాలు ఏమాత్రం బాగోలేవంటూ ఇప్పటికే పలు కథనాలు గతంలోనే వచ్చాయి. తాజాగా వారిద్దరి మధ్య విడాకులు ఖాయమని చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తో కలిసి పని చేసిన అధికారులు బయటకు వెల్లడించటం గమనార్హం.  ఈ ఎన్నికల ఫలితాల కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతూ.. తుది ఫలితం ఎప్పుడెప్పుడు వెల్లడవుతుందా? అని వెయిట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ట్రంప్ శ్వేతసౌధాన్ని ఖాళీ చేయగానే.. మెలానియా ట్రంప్ విడాకులకు అప్లై చేయటం ఖాయమని చెబుతున్నారు. మెలానియా వద్ద సీనియరర్ అడ్వైజర్ గా పని చేసిన స్టెఫ్నీ వోకాఫ్ ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ట్రంప్ దంపతులు వేర్వేరు గదుల్లో ఉండేవారని.. విడాకుల కోసం మెలానియా ఎంతగానో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

వారి వివాహం ఒక లావాదేవీ మాత్రమేనని చెప్పిన ఆమె.. 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని ఆమె ఏ మాత్రం ఊహించలేదన్న మాటను తన స్నేహితుల వద్ద చెప్పినట్లుగా చెబుతున్నారు. బహిరంగంగా ఉన్న వేళలో.. ఇద్దరు బాగున్నట్లే కనిపించినా.. అదంతా అమెరికా ఫస్ట్ లేడీ స్థానానికి ఉన్న గౌరవాన్ని తగ్గించకూడదనే అలా ఉన్నట్లుగా చెబుతారు. వారి మధ్య సంబంధాలు ఏ మాత్రం బాగోలేవన్న విషయానికి సాక్ష్యంగా..  ఆ మధ్యన విమానం దిగే సమయంలో.. మెలానియా ట్రంప్ చేతిని పట్టుకునే ప్రయత్నం ట్రంప్ చేయటం.. అందుకు ఆమె రిజెక్టు చేసిన వీడియో అప్పట్లో వైరల్ గా మారింది.  ఈ లెక్కన చూస్తుంటే.. రానున్న రోజుల్లో ట్రంప్ నకు మరెన్ని షాకులు తగలనున్నాయో?


Tags:    

Similar News