అమెరికా అధ్యక్ష పీఠం కోసం హిల్లరీ క్లింటన్ తో పోటీపడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రోజు రోజుకూ వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే! ఒకవైపు మీడియా మరోవైపు మహిళలు ట్రంప్ ని నేరుగా విమర్శించడం మొదలుపెట్టేశారు. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం ట్రంప్ గ్రాఫ్ ని క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తుందనే కథనాలు వరుసగా వెలువడుతున్నాయి. మహిళలపై ట్రంప్ కు ఏమాత్రం గౌరవం లేదని - మహిళలను చులకనగా చూడటం, బహిరంగంగా అవమానించడం ఆయన నిత్యకృత్యాలనీ హిల్లరీ ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ పై రోజురోజుకూ పెరిగిపోతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆయన భార్య మెలానియా రంగంలోకి దిగారు.
"నా భర్త మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పే. అయితే ఆయనిప్పుడు మునుపటి మనిషి కాదు. ఇప్పుడాయనలో పరిపక్వతతో కూడిన నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. పైగా ఇప్పటికే ఆయన కూడా క్షమాపణలు చెప్పుకున్నారు. కాబట్టి ఆయన క్షమాపణలను ప్రజలు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ మెలానియా ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా, ఇటీవలే వెలుగులోకి వచ్చిన 2005 నాటిదని చెబుతున్న వీడియోలో ట్రంప్ - మహిళలను ఉద్దేశించి తీవ్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడమే కాక రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని వదులుకోవాలనే డిమాండ్ సైతం వ్యక్తమైంది. దీంతో ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్న ట్రంప్, తాను కూడా సాధారణమైన వ్యక్తినే అని, చిన్న చిన్న తప్పులకు తానేమీ అతీతుడిని కాదన్నట్లు చెప్పి క్షమించాల్సిందిగా ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. ఇలా క్షమాపణలు వేడుకున్నప్పటికీ నిరసనలు ఏమాత్రం ఆగడం లేదు. దీంతో ఆ వేడిని చల్లార్చేందుకే ట్రంప్ సంతీమణి నేరుగా రంగంలోకి దిగి పై విదంగా ప్రకటన విడుదల చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/