మ‌గాడు-మ‌హిళ స‌మానం కాదు​:​ మేధావులు

Update: 2017-10-11 05:38 GMT
మ‌న‌సును గాయ‌ప‌రిచేలా మాట్లాడే హ‌క్కు ఎవ‌రికీ ఉండ‌దు.  కానీ.. ఆ ప‌ని చేసేందుకు కొంద‌రు ముందుకు రావ‌టం చూసిన‌ప్పుడు షాక్ తినాల్సిందే. ప్ర‌కృతి సిద్ధంగా ఉండే అంశాల్ని ప‌ట్టుకొచ్చి.. మ‌గా.. ఆడ ఇద్ద‌రూ స‌మానం కానే కాదంటూ చెప్పే మాట‌ల్ని విన్న‌ప్పుడు ఎందుకిలా? అన్న సందేహంతో పాటు.. మహిళ‌లంటూ మ‌రీ అంత చిన్న‌చూపా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

మ‌గ‌వారి కంటే మ‌హిళ‌లు ఎప్పుడూ త‌క్కువేన‌ని మామూలోళ్లు కాదు.. మేధావుల‌మ‌న్న ట్యాగ్ లైన్ పెట్టుకొన్న ముస్లిం మేధావుల సంఘం జామియ‌త్ ఉలామా స్ప‌ష్టం చేయ‌టం విశేషం. పురుషులు గ‌ర్భాన్ని మోయ‌లేరు క‌దా? అంటూ ఇద్ద‌రూ స‌మానం కాద‌న్న త‌మ వాద‌న‌కు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పింది.

ఆడ‌.. మ‌గ ఇద్ద‌రూ స‌మాన‌మేన‌న్న‌దే నిజ‌మైతే.. మ‌హిళ‌లు త‌మ గ‌ర్భాన్ని పురుషుల‌తో క‌లిసి నాలుగున్న‌ర నెల‌ల చొప్పున ఎందుకు పంచుకోరు? అంటూ వేసిన ప్ర‌శ్న వింటే మ‌హిళ‌కే కాదు.. మ‌న‌సున్న మ‌గాడికి సైతం మంట పుట్ట‌టం ఖాయం. ఒక‌వేళ‌.. అదే కార‌ణ‌మైతే.. ఇలా మాట్లాడే వారంద‌రికి జ‌న్మ‌నిచ్చింది మ‌హిళేన‌ని.. ఆమె మ‌గాళ్ల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ‌న్న మాట చెప్పినా బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా చిన్న‌బుచ్చేలా.. చుల‌క‌న చేసేలా మాట్లాడ‌టాన్ని ఖండించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌లు న‌లుగురు బృందంగా ఏర్ప‌డి పురుషుల తోడు లేకుండా హ‌జ్ యాత్ర‌కు అనుమ‌తించాలంటూ కేంద్రం నియ‌మించిన ఒక క‌మిటీ ఒక నివేదిక ఇచ్చింది. దీనిపై ముస్లిం మేధావుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. క‌మిటీ త‌న సిఫార్సు ద్వారా ఇస్లాం చ‌ట్ట‌మైన ష‌రియాకు వ్య‌తిరేకంగా న‌డుచుకోవాల‌న్న‌ట్లుగా ఉంద‌ని మండిప‌డుతున్నారు. మ‌హిళ‌ల్ని రెచ్చ‌గొడుతున్నారంటూ సున్నీ బ‌రెల్వీ మేధావులు ఆరోపిస్తున్నారు. పేరుకే మేధావుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మేథావుల ఇళ్ల‌ల్లో మ‌హిళ‌లు కాస్త క‌లుగ‌జేసుకొని.. మ‌హిళ‌ల గొప్ప‌త‌నం వారికి అర్థ‌మ‌య్యేలా చేస్తే బాగుంటుంది. పురుష అహంకారంతో మాట‌లు మిగులుతున్న ఇలాంటి సంఘాల మాట‌ల్ని అంద‌రూ ఖండించాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక‌వేళ‌.. మ‌గాళ్ల కంటే త‌క్కువైన మ‌హిళ‌లు.. గ‌ర్భాన్ని దాల్చ‌కూడ‌ద‌ని డిసైడ్ అయితే.. మొన‌గాళ్లు లాంటి మ‌గాళ్లు ఆడోళ్లు చేసే ప‌నిని చేయ‌గ‌ల‌రా? గ‌ర్భాన్ని మోసి ప్ర‌పంచాన్ని ముందుకు తీసుకెళ్ల‌గ‌ల‌రా?

Tags:    

Similar News