ఆ హామీ ఇచ్చే ముందు సిగ్గు అనిపించ‌లేదా సార్ !

Update: 2018-11-17 13:53 GMT
జైట్లీ సార్‌... మొన్న‌మొన్న‌టి చ‌రిత్ర కూడా మ‌రిచిపోయారా సార్‌? మ‌రీ ఇలా అయితే ఎలా సార్‌.. జ‌నాలు ఇప్ప‌టివ‌ర‌కు తిట్టింది చాల‌లేదా? ఇంకా తిట్టించుకోవాలా సార్ మీరు?

ఇపుడు ఏం జ‌రిగింది? ఆయన ఏమ‌న్నారు అని ఆలోచిస్తున్నారా? 2014 కు ముందు మోడీ అండ్ టీం కోటి ఉద్యోగాలు సృష్టిస్తాం అని హామీ ఇచ్చిన విష‌యం తెలుసుక‌దా. అలాగే జైట్లీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన రెండు నిర్ణ‌యాల వ‌ల్ల కోటి ఉద్యోగాల‌కు పైగా పోయిన విష‌య‌మూ మ‌న‌కు తెలుసు క‌దా. తాజాగా జైట్లీ సార్ మ‌ధ్య ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు. ఎలాగూ అమ‌లు చేయం క‌దా ఏం హామీలిస్తే ఏంటి అనుకున్నారో ఏమో...భారీ వ‌రాల వ‌ర్షం కురిపించారు.

ఆయ‌న ఇచ్చిన వరాలు వింటే... దిమ్మ‌తిర‌గ‌డం గ్యారంటీ. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి మెట్రో ఇస్తార‌ట‌. యుత‌కు పది లక్షల ఉద్యోగాలు ఇస్తార‌ట‌. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తార‌ట‌. వీటిని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్ సాక్షిగా జ‌నానికి చెప్పారు మ‌న జైట్లీ సారు. ఇంకెవ‌రైనా చెబితే న‌మ్ముతారేమో గాని ఈ మాట‌లు జైట్లీ సార్ చెబితే జ‌నాలు న‌మ్ముతారా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ప్రజల కనీస జీవన ప్రమాణాలు పెంచడమే తమ అజెండా అని ఆయన వ్యాఖ్యానిస్తే... వారి బ‌తుకు వారిని బ‌తుక్కోనిస్తే చాలు సార్ అంటూ జ‌నం వ్యాఖ్యానించే పరిస్థితి.

‘2003 నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ను ఏలుతున్న బీజేపీ ఇంత‌కాలం తేలేని మెట్రోను ఉద్యోగాల‌ను ఇపుడు ఇస్తామ‌న‌డం విడ్డూరం. ఒక మెట్రో ఇవ్వ‌డానికి వారికి ప‌ద్నాలుగేల్లు స‌రిపోలేద‌ట‌. ఇపుడు గ్వాలియర్‌ - జబల్‌ పూర్ నగరాలకు మెట్రో రైలు తెస్తామ‌ని చెబుతున్నారు. ఇక‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలికలకు స్కూటీ ఇస్తార‌ట. ప‌క్కింట్లో అమ్మాయికి స్కూటీ ఇప్పించాల‌ని ఏ ఓట‌రు అయినా ఓటేస్తారా? జ‌నం అందుకోసం ట్యాక్స్ క‌డతారా? మ‌ంచి విద్య‌కు - బాగా చదివే వారికి ష్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వాలి గాని దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్న జైట్లీ వంటి వ్య‌క్తులు జ‌నాల సొమ్మును కొంద‌రికి దోచిపెట్టే ఇలాంటి హామీలు ఇస్తే రాష్ట్రం ఏమైపోవాలి?
Tags:    

Similar News