విజయవాడ మెట్రో ప్రధాన స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కు మెట్రో స్టేషన్ కు అనుసంధానం ఉండాలని నిర్ణయించింది. అందువల్ల, విజయవాడలోని పీఎన్ బీఎస్ బస్ స్టేషన్ ఎదుటే మెట్రో ప్రధాన స్టేషన్ ను కూడా నిర్మించాలని తీర్మానించింది.
మెట్రో ప్రధాన స్టేషన్ ను 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ 5 మల్టీప్లెక్స్ గా నిర్మించనున్నారు. ఇక్కడ కింద జాతీయ రహదారి వెళుతుంటే.. పైన మెట్రో కారిడార్ పరుగులు తీయనుంది. ప్రధాన స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో మెట్రో రైళ్లు పరుగులు పెడతాయి. మొదటి ఫ్లోర్ లో మెట్రో స్టేషన్ ఉంటుంది. రెండు,మూడు, నాలుగు ఫోర్లలో మెట్రో కార్యాలయాలు ఉండనున్నాయి. అన్నిటికన్నా పైన రూఫ్ టాప్ లో ఫుడ్ కోర్టు ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. మెట్రో స్టేషన్ నుంచి పీఎన్ బీఎస్ బస్ స్టేషన్ కు స్కై వాక్ ను ఏర్పాటు చేయనున్నారు. దీని పక్కనే ఐదంతస్తుల పార్కింగ్ మల్టీ స్టోర్ ను నిర్మించనున్నారు.
విజయవాడ మెట్రోకు సంబంధించి కిలోమీటరుకు ఒకటి చొప్పున మొత్తం 23 మెట్రో స్టేషన్లు నిర్మిస్తారు. వీటిలో ప్రతిపాదిత బందరు, ఏలూరు కారిడార్లలో 11 చొప్పున ఉంటాయి. ప్రధాన మెట్రో స్టేషన్ తో కలిపితే 23 అవుతాయి.