వ‌న్నాక్రైకి మైక్రోసాఫ్ట్ సొల్యూష‌న్ క‌నిపెట్టింది

Update: 2017-06-17 13:34 GMT
ఇటీవ‌ల యావత్‌ ప్రపంచాన్ని వణికించిన వన్నాక్రై మాల్‌ వేర్‌ దాడులతో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అప్రమత్తమైంది. మాల్‌వేర్‌  దాడులను అడ్డుకునేందుకు విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ కొత్త సెక్యూరిటీ అప్‌ డేట్‌ ను విడుదల చేసింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాత వెర్షన్‌ ఓ.ఎస్‌ లకూ అప్‌ డేట్‌ లను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ అప్‌ డేట్‌ ను పొంద‌డం ద్వారా మాల‌వ్‌ వేర్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవ‌చ్చున‌ని తెలిపింది.

మూడేళ్ల క్రితమే విండోస్‌ ఎక్స్ పీకి మైక్రోసాఫ్ట్‌ సాంకేతిక సహాయం నిలిపివేసింది. 2014 ఏప్రిల్‌ 8 నుంచి ఆ ఓ.ఎస్‌ కు ఎలాంటి భద్రతాపరమైన అప్‌ డేట్లు విడుదల చేయబోమని ప్రకటించింది. ఎక్స్‌ పీ వినియోగిస్తున్న వారంతా కొత్త వెర్షన్లకు అప్‌ డేట్‌ అవ్వాలని సూచించింది. ఐతే ఇప్పటికీ దాదాపు 7శాతం కంప్యూటర్లలో ఆ ఓ.ఎస్‌ ను వినియోగిస్తున్నారు. అయితే పాత వెర్షన్‌ ఓఎస్‌ లతో పనిచేస్తున్న కంప్యూటర్లపైనే ‘వన్నాక్రై’ దాడులు అధికంగా జరుగుతున్నాయని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. దీంతో మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన నిబంధనలను సడలించింది. విండోస్‌ ఎక్స్‌ పీ వెర్షన్‌కూ సెక్యూరిటీ అప్‌ డేట్‌ ను విడుదల చేసినట్లు తెలిపింది. మొత్తం 94 లోపాలను సవరించినట్లు వెల్లడించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News