రాత్రి అంటే భయం. రాత్రి అంటే చీకటి. రాత్రి అంటే ప్రపంచం గాఢ నిద్రలో ఉండే సమయం. ఇక అర్ధరాత్రి అంటే మరీ భయం. మరీ చీకటి. మరీ గుబులు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం రాత్రిళ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, దాని చుట్టుపక్కల గ్రామాలు నిద్రలోకి జారుకున్నాక రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి.
ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అయితే ఈమధ్య రాత్రిళ్లే ఎక్కువగా జరుగుతుండడం అక్కడి రాజకీయాలకు అద్దం పడుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ నాయకులు, పత్రికాధిపతులు, పారిశ్రామిక వేత్తలు.. ఇలా చాలా మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని రాత్రిళ్లే కలుస్తున్నారు. అర్ధరాత్రుళ్లు చర్చలు ఏమిటని మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే పగలు అపాయింట్ మెంట్ దొరకలేదంటున్నారు.
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సర్వేల దిట్టగా పేరున్న లగడపాటి రాజగోపాల్ తన మీడియా మిత్రుడు వేమూరి రాధాక్రిష్ణతో కలిసి అమరావతిలో చంద్రబాబు నాయుడ్ని కలిసారు. వీరి కలయికకు కారణాలు తెలియలేదు. అయితే వీరిద్దరు రాత్రి తొమ్మది గంటల తర్వాత చంద్రబాబు నాయుడ్ని కలవడం మాత్రం ప్రతీ చోటా చర్చనీయాంశం అయ్యింది.
ఇక రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడ్ని కలుసుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని, ఆయనతో సహా నాలుగు టిక్కట్లు అడిగారని చెబుతున్నారు.
కోట్ల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని అర్ధరాత్రి కలుసుకుని రెండు గంటలకు పైగా చర్చించారు. జిల్లాకు నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించానని కోట్ల చెబుతున్నారు. ఇక సోమవారం అర్ధరాత్రి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బావమరిది ద్వారకానాథ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలుసుకున్నారు. తనకు రాయచోటి టిక్కట్ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడ్ని ఆయన కోరినట్లు చెబుతున్నారు. ఈయన కూడా అర్థరాత్రి చంద్రబాబు నాయుడ్ని కలవడంపై చర్చ జరుగుతోంది. త్వరలో ఎన్నికలు జరుగుతూండడంతో ఇక ముందు అన్ని పార్టీలలోనూ అర్ధరాత్రి సమావేశాలు ఎక్కువ ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.