రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయస్థాయిలో సంచలనంగా మారిన గొర్రెకుంట హత్యల ఉదంతంలో మరో కొత్త అంశం బయటకు వచ్చింది. వివాహేతర సంబంధం ఉన్న రఫికను పెళ్లాడేందుకు ఇష్టం లేని నిందితుడు సంజయ్ కుమార్.. రైల్లో నుంచి ఆమెను తోసేసి చంపేయటమే కాదు.. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు వీలుగా వారి బంధువులు తొమ్మిదిమందిని చంపేసిన ఉదంతం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మరో దుర్మార్గం బయటకు వచ్చింది.
తనకు వివాహేతర సంబంధం ఉన్న రఫిక కుమార్తె మీద సంజయ్ కుమార్ కన్నేయటం.. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయటం తెలిసిందే. ఈ క్రమంలోనే రఫికా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం పాత విషయమే. కొత్తగా బయటకు వచ్చిన అంశం ఏమంటే.. నిద్రమాత్రల్ని వేసి తొమ్మిదిమందిని చంపిన సంజయ్ కుమార్.. అదే నిద్రమాత్రలను ప్రయోగించిన రఫిక కుమార్తె (15ఏళ్లు)పై అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించిన కీలక ఆధారాల్ని పోలీసులు సేకరించినట్లుగా సమాచారం. ఒకవేళ.. ఈ సమాచారం నిజమైతే.. ఆ దుర్మార్గుడి మీద పోక్సో చట్టం ప్రకారం మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తల్లిని కోల్పోయిన రఫిక ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు సంజయ్ కుమార్ కు ఉరి తప్పదన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఎంతకాలానికి ఈ తీర్పు వస్తుందన్నది ఇప్పుడు క్వశ్చన్.