హిందువులతో ముస్లిం యువతులు తిరిగితే దాడులు చేస్తారా?: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-10-19 06:55 GMT
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని, హిందుత్వవాదులపై విమర్శలు గుప్పించారు. మన సైనికులను పాకిస్తాన్ చంపుతుంటే పాక్ తో ప్రధాని మోదీ క్రికెట్ ఆడేందుకు సిద్ధపడ్డారని అసదుద్దీన్ విమర్శించారు. హిందువులతో ముస్లిం యువతులు తిరిగితే మీరెవరని అసదుద్దీన్ నిలదీశారు.

‘ముస్లిం యువతి, హిందూ యువకులపై దాడి చేసి సోషల్ మీడియాలో అవమానపరచడం దారుణం.. హిందూ యువతులు, ముస్లిం యువకులతో తిరిగితే సంతోషపడుతున్నారు. అది చాలా పెద్ద తప్పు. మన కుటుంబాల్లో మార్పురావాలి.. యూపీలో యోగిని ఓడించి తీరుతాం’ అని అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని అసద్ విమర్శించాడు. చైనాపై మాట్లాడేందుకు మోడీ భయపడుతున్నాడని.. చైనా చొరబడితే ఎందుకు మౌనంగా ఉన్నారని మోదీ సర్కార్ ను ప్రశ్నించారు.

ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలతో తిరిగినా వాళ్ల చావు ఏదో వాళ్లు చస్తారని.. మీరు దాడులు చేయడానికి మధ్యలో మీరెవరు? అని అసదుద్దీన్ ప్రశ్నించారు. ముస్లిం యువకులు చేస్తున్న దాడులపైనా తీవ్రస్తాయిలో మండిపడ్డారు.

ముస్లిం యువతి, హిందూ యువకులపై దాడులు చేసి సోషల్ మీడియాలో అవమాన పరచడం దారుణమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.‘హత్యలకు పాల్పడుతున్న నేరస్థులను సమాజం నుంచి బహిష్కరించాలి. ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగిని ఓడించి తీరుతాం..దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని పీఎం దాని గురించి మాట్లాడారు. చైనా భారత భూభాగంలోకి చొరబడినా ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడానికి భయపడుతారు అంటూ నిలదీశారు. పుల్వామా టనకు ప్రతీకారం తీర్చుకున్నారు. చైనా చొరబడితే ఎందుకు స్పందించరని నిలదీశారు.

కశ్మీర్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో అమిత్ షా ఏం చేస్తున్నారని.. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు వస్తున్నా నియంత్రించడం లేదని ఆరోపించారు. ఉగ్రవాదులు చొరబడుతున్నా ఎలాంటి సీజ్ ఫైర్ అక్కడ చేస్తున్నారని అసద్ నిలదీశారు.


Tags:    

Similar News