వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం టెన్షన్ మొదలైంది. వరుసగా ఒక్కో రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం కన్ను తాజాగా యూపీ పైనా పడింది. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం 100 స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే డిసైడ్ చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం యూపీ పర్యటనలోనే ఉన్నారు. తమతో చేతులు కలిపే స్థానిక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలతో కూడా చర్చల్లో బిజీగా ఉంటున్నారు.
అయితే ఎస్పీతో జరిగిన చర్చల్లో ఓ విషయంలో రెండు పార్టీలు నిర్ణయానికి రాలేకపోయాయి. దాంతో పొత్తు విషయం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అదేమిటంటే ఎస్పీ అధికారంలోకి వస్తే తమకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని అసద్ పట్టుబట్టినట్లు సమాచారం. అయితే దీనికి ఎస్పీ సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని కాని ఇచ్చేది లేదని కానీ ఏమీ తేల్చలేదట. దాంతో రెండు పార్టీల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన వచ్చిందంటున్నారు.
దశాబ్దాల పాటు కేవలం పాతబస్తీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తం చేయాలని అసద్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. ముందు గుజరాత్ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసింది. గుజరాత్ లో బోణీ కొట్టకపోయినా మహారాష్ట్రలో మాత్రం రెండు అసెంబ్లీ సీట్లలో గెలిచింది. తర్వాత జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది.
ఆ తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా ఐదు అసెంబ్లీల్లో గెలిచింది. ఈ మధ్యనే జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో కూడా పోటీ చేసినా బోణికొట్టలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను గెలవకపోయినా ప్రత్యర్ధుల గెలుపోటములను శాసించేంత ఓట్లయితే రాబట్టుకుంటోంది. గుజరాత్, బీహార్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది.
కేవలం ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో మాత్రమే ఎంఐఎం పోటీ చేస్తోంది. దీని వల్ల ఓట్లలో చీలిక వచ్చేస్తోంది. మరి యూపిలో ఎంఐఎం వల్ల ఏ పార్టీపై దెబ్బ పడుతుందో తెలీకుండా ఉంది. అందుకనే పెద్ద పార్టీలు కూడా ఎంఐఎంతో పొత్తులు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకంటే రాబోయే ఎన్నికలు బీజేపీతో పాటు ఎస్పీ, బీఎస్పీకి కూడా డూ ఆర్ డై అన్న పరిస్ధితే కాబట్టి.