వామ్మో.. వామ్మో.. ఏంది ఈటెల ఈ మధ్యన మరీ అంతలా చెలరేగిపోతున్నావ్. గతంలో మాట్లాడితే ఒక లెక్క ఉండేది. ఇప్పుడది కాస్తా మిస్ అవుతున్నట్లుందే. మాటల్లో తోపుగానివే. కానీ.. అడ్డగోలుగా మాట్లాడితే అడ్డంగా బుక్ అయిపోతావ్ కదా. ఆ విషయాన్ని ఎందుకు మరుస్తున్నావ్.
అరవైఏళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్ర అప్పు వాటా 69వేల కోట్లు అయితే.. కేవలం మూడున్నరేళ్ల వ్యవధిలో 60వేల కోట్ల కోట్లను అదనంగా చేయేడేందంటే.. ఎంత దబాయించేశావ్. భాజాప్తా అప్పులు చేస్తాం మరి అంటూ తేల్చి చెప్పినవ్. ఇష్టం వచ్చినట్లు అప్పు చేస్తుంటే అడుగుడు తప్పన్నట్లుగా తేల్చేసే మాటలు వింటే.. మా నాయన ఇకపై అప్పు చేస్తావేందంటే.. బాజాప్తా అప్పు చేస్తా.. ఎందుకన్న లాజిక్ ఈటెల సాబ్‌ను అడగండని చెప్పేస్తా.
నీ పుణ్యమా అని.. అప్పులు చేసేటోళ్లు కూడా హీరోలు అయిపోతున్నారు. మొన్నటి వరకూ అప్పు చేయుడు తప్పన్నట్లు ఉండేది. నిన్నటి సంధి.. అప్పు చేయుడు కూడా హీరోయిక్ అన్న విషయాన్ని తెలంగాణ సమాజానికి తెలియజేసినందుకు యావత్ తెలంగాణ సమాజం మీకు రుణపడి ఉండటం ఖాయం. అప్పుతోనే అభివృద్ధి.. ఎంత అప్పు చేస్తే అంత అభివృద్ధి.. అప్పు చేయుండ్రి.. వడ్డీలు కట్టుండ్రి.. ఫ్యూచర్ గురించి ఆలోచించి దిమాక్ ఖరాబ్ చేసుకోకుండ్రి అంటూ తమరిచ్చిన సందేశం తెలంగాణ జాతికి శిలాశాసనం.
అప్పుల చేసుడులో సరికొత్త తత్త్వాన్ని తెర మీదకు తెచ్చి రోజు గడవక ముందు.. మరో కొత్త రూల్‌ను అందరికి తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. అధికారపక్షం అంటే ఎంతగా అణిగిమణిగి ఉండాలి. ఎంత ఫైర్ బ్రాండ్ అయితే మాత్రం సంపత్ నోటికి హద్దుఆపు ఉండాలి కదా. తాను మాట్లాడేది తెలంగాణ సర్కారుతోనని.. ఉద్యమ వేళలో.. తెలంగాణ వస్తే రాష్ట్ర పాలన ఎలా ఉంటుందో భావోద్వేగంతో మాటలు చెప్పి మనసు దోచుకున్న మీలాంటి పెద్ద మనిషితో మాట్లాడే తరీకా అదేనా?
కాస్త వెనుకా ముందు చూసుకోవాలి కదా. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయొచ్చా? ఎంత పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఆలస్యమైతే మాత్రం అంత నోరు పారేసుకుపోవాలా? ఎవరి కోసం ఇదంతా చేస్తుంది? మన పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు నాలుగు రోజులు ఆలస్యమైతే ఫర్లేదు. కానీ.. ఆంధ్రా కాంట్రాక్టర్లు.. ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కాంట్రాక్టర్లకు టైంకి పైసలు ఇవ్వకుంటే తెలంగాణ ఇమేజ్ ఏమైపోవాలి?
పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం తిప్పలు పడితే పడాలి. ఆ మాత్రం సర్దుకుపోకుంటే ఎలా. అంత మాత్రానికే సంపత్.. దౌర్బాగ్యం లాంటి మాట అనేస్తారా? తెలంగాణ సర్కారు గురించి.. సీఎం కేసీఆర్ పని తీరు గురించి ఏమనుకుంటున్నారు? ఏ మాటకు ఆ మాటే నిండు సభలో దౌర్బాగ్యం లాంటి బూతు పదం వాడితే మీకు ఆగ్రహం రావటంలో అర్థముందన్నది పట్టించుకోక అదే సంపత్ మళ్లీ.. సంస్కారహీనం లాంటి పెద్ద మాటలు మాట్లాడితే మీలాంటి బక్కజీవి పరిస్థితేంది?
అందుకే.. ఈసారి కేసీఆర్ సాబ్ తో మాట్లాడేసి.. విపక్షాలు ఏమేం పదాలు వాడకూడదో ఒక రూల్ చేసి పారేస్తే పీడా పోతుంది. అయితే గియితే తిట్టాలన్నా.. ఆగ్రహం వ్యక్తం చేయాలన్నా తెలంగాణకే తలమానికం లాంటి కేసీఆర్ ఉండగా.. సంపత్ లాంటోళ్లు మాట్లాడేస్తే ఎలా? ఎవరిని ఎంతలా తిట్టాలన్న ముచ్చటకు ల్యాండ్ మార్క్ లాంటి కేసీఆర్ ఉన్నారుగా. కోదండం మాష్టారి లాంటోడ్ని లంగాగాళ్లు అనాలె కానీ దౌర్బాగ్యం.. సంస్కారహీనం లాంటి పదాలు వాడొచ్చా? నిజమే.. మీ ఆగ్రహంలో ధర్మం ఉంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆ మాత్రం హవా నడిపించకుంటే ఏం బాగుంటుంది. మీరేమన్నా పట్టించుకోం.. మీ వెంటే ఉన్నా.. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్‌ను జ్యోతిబసు కంటే మొనగాడిగా చేస్తాం. సంపత్‌లాంటోళ్ల మాటల్ని పట్టించుకోకుండా.. రానున్న ఏడాదిన్నరలో రికార్డు స్థాయిలో తెలంగాణ అప్పు పెంచేయాలి. సంపన్న రాష్ట్రం సత్తా ఏంటో చాటాలి. అప్పులోనూ మనకు మించినోళ్లు లేరన్నంత అప్పు చేయాలె. చేతికి అధికారం ఇచ్చిన తెలంగాణ సమాజానికి ఆ మాత్రం మేలు చేయకుంటే ఎలా?