`సీఎం ప‌వ‌న్‌` సినిమా తీస్తే.. ప్రొడ‌క్ష‌న్ చేస్తా: మంత్రి గుడివాడ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2023-01-03 13:30 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేసే మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌.. తాజాగా మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించే స‌భ‌ల్లో ఆయ‌న అభిమానులు.. ఆయ‌న‌ను సీఎం ప‌వ‌న్‌.. సీఎం ప‌వ‌న్ అని నినాదాలు చేస్తు న్నార‌ని అన్నారు. ఆయ‌న సీఎం అయ్యేదీ లేదు.. పోయేది లేద‌ని వ్యాఖ్యానించారు. పొరుగు పార్టీల‌ను.. ప‌క్క పార్టీ నేత‌ల‌ను సీఎంను చేయ‌డం కోస‌మే ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తార‌ని.. గుడివాడ విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన గుడివాడ అమ‌ర్నాథ్ త‌ర‌చుగా ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం కావాల‌నేది ఆయ‌న అభిమానుల కోరిక అయితే అయి ఉండొచ్చ‌ని.. కానీ, ఆయ‌న ఎప్ప‌టికీ ముఖ్య‌మంత్రి కాలేర‌నిఅన్నారు.

ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం క‌ల‌లో మాటే కాబ‌ట్టి దీనిని సినిమాగా తీస్తే బాగుంటుంద‌ని తెలిపారు. `సీఎం ప‌వ‌న్‌` సినిమాతీస్తే.. దానికి ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తాన‌న్నారు.

ప‌వ‌న్ ఎప్పుడూ ప‌క్క పార్టీల విజ‌యానికి మాత్ర‌మే ప‌నిచేస్తార‌ని అన్నారు. క‌నీసం ఇప్ప‌టికైనా 175 స్థానాల్లో 175 చోట్ల పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ఎందుకు చెప్ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క సీటు గెలుచుకున్న ప‌వ‌న్‌.. ఈ సారి అది కూడా ద‌క్క‌ద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గ‌తంలో భీమ‌వ‌రం, గాజువాక‌ల్లో పోటీ చేసిన ప‌వ‌న్‌.. ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాకుండా వేరే చోట పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ఇంత ఓట‌మి భ‌యం ఉన్న పార్టీ అధినేత ప‌వ‌న్ ఒక్క‌రే అయి ఉంటాడ‌ని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News