టీఆరెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ తెలంగాణ శశికళ అని.. ఆయనకు త్వరలోనే జైలు శిక్ష పడడం ఖాయమని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శశికళకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదని ఆయన జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అందుకే నిత్యం తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుంటారని విమర్శించారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి రేవంత్ పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు తీశారు. గోడలకు రంగులేసుకుంటూ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తాను కేసీఆర్, టీఆర్ ఎస్ నేతలను బాగా తిడుతున్నానని చెప్పుకొంటూ నెలనెలా విజయవాడ వెళ్లి చంద్రబాబు నుంచి జీతం తెచ్చుకుంటున్నారంటూ వెటకారమాడారు.
రేవంత్‌రెడ్డికి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని, ఆయన ఓ బచ్చా అని.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లినా అతనికి బుద్ధిరాలేదని విమర్శించారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో సమైక్యాంధ్రకు మద్దతు పలికిన తెలంగాణ ద్రోహికి తనను విమర్శించే స్థాయి ఏమాత్రం లేదన్నారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉంటూ ఆయన మెప్పుకోసం తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడని మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడ్డానని ఆరోపణలు చేస్తున్న రేవంత్.. దానిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేకుంటే పరువునష్టం కేసు వేసి జైలుకు పంపుతానని హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/