టీఆర్ ఎస్ పార్టీ వ్యవస్థాపక సమావేశాల సందర్భంగా పార్టీ నేతలు కూలీ పనిచేసి డబ్బులు సంపాదించాలని గులాబీ దళపతి - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆలస్యం ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఏకంగా మంత్రుల స్థాయిలోని నాయకులు ఎంట్రీ ఇచ్చి ఎర్రటి ఎండలో హమాలీ అవతారమెత్తారు. అయ్యో మంత్రి గారు అంత కష్టపడిపోయారా అనుకోకండి. బస్తా మూటలు మోసి - అట్టపెట్టలను లారీలో ఎక్కించనందుకు సదరు మంత్రిగారు అక్షరాలా రూ.3 లక్షలు సంపాదించారు. ఇలా ఒక్కరోజులోనే రూ.3 లక్షల `కూలీ` సంపాదించింది తెలంగాణ ఎస్సీ సంక్షేమం, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.
టీఆర్ ఎస్ ప్లీనరీ నిధుల సమీకరణ కోసం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి నెత్తికి రుమాలు చుట్టుకొని నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలోని విస్టా ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, ఐడియల్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీల్లో హమాలీ పని చేశారు. ప్రజాప్రతినిధుల కష్టానికి మెచ్చిన విస్టా కంపెనీ యాజమాన్యం రూ.లక్ష, ఐడియల్ కంపెనీ యాజమాన్యం రూ.2 లక్షల కూలి ముట్టజెప్పింది.ఇక కూలీలతో కలిసి మంత్రి పనిచేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ కూలీ తీరుపై అప్పుడే తెలంగాణ విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. పొట్టకూటి కోసం కూలీ పని చేసేవారికి వందో రెండు వందలో కంపెనీలు ఇస్తుంటాయి. అయితే ఇదంతా పేదవాళ్లకు మాత్రమే. పెద్దోళ్లకు మాత్రం లక్షల్లో కూలీ ఇస్తారని అనుకోవాలా అంటూ వ్యాఖ్యానిస్తున్నాయి. పెద్దోళ్లకైతే ఒక కూలీ పేదోళ్లకైతే ఒక కూలినా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/