ప్రభుత్వంలో కొన్ని శాఖలు మీద సెంటిమెంట్లు ఉంటాయి. ఆ శాఖను అందుకున్న వారు ముందుకు వెళ్లలేదని, రాణించలేదని అంటారు. అలాంటి శాఖలలో పవిత్రమైన దేవాదాయ శాఖ చేరడం కొంత వింతే అయినా ఎందుకో ఉమ్మడి ఏపీ నుంచి చూస్తే ఈ శాఖకు మంత్రులుగా ఉన్న వారికి తరువాత పొలిటికల్ గా అచ్చి రావడంలేదనే అంటారు.
ఇదిలా ఉంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ ఫైర్ చూపించి కొత్త ట్రెండ్ కి తెర తీసిన ఘనత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ది. ఇక ఆయన ముప్పయి నాలుగు నెలల పాలన తరువాత ఆ శాఖ అటునుంచి ఇటు తిరిగి కొట్టు సత్యనారాయణకు చేరింది. ఆయన వైసీపీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే.
ఇపుడు ఆయనకు లక్ వరించి మంత్రి కావడమే కాదు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఆయనకు దేవాదాయ శాఖను ముఖ్యమంత్రి జగన్ కేటాయించారు. దీంతో నాలుగేళ్ల తరువాత తిరిగి ఈ శాఖ గూడేనికి చేరిందని అంటున్నారు. అదెలా అంటే 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే తాడేపల్లి గూడేనికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు ఈ శాఖను కేటాయించారు.
ఆయన నాలుగేళ్ల పాటు మంత్రిగా ఇదే శాఖను చూశారు. ఇక 2018లో బీజేపీ టీడీపీల మధ్య విభేదాలు రావడంతో పొత్తు పెటాకులు అయింది. దాంతో మాణిక్యాలరావు రాజీనామా చేశారు. ఆ తరువాత ఎన్నికల్లో టీడీపీ ఓడి వైసీపీ గెలవడంతో వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇపుడు చూస్తే మళ్ళీ తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యే అయిన కొట్టు సత్యనారాయణకు ఈ శాఖ దక్కింది. ఆయన పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు. భక్తి భావన నిండుగా ఉంది. పైగా దాంతో రానున్న రెండేళ్ళూ ఈ శాఖను ఆయన చక్కగా ముందుకు తీసుకెళ్తారు అని అంతా ఆశిస్తున్నారు. మొత్తానికి తాడేపల్లిగూడేనికి దేవుడి శాఖకు అందమైన బంధం ఉందనే అంటున్నారు అంతా.