తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రుల్లో మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తీరే వేరు. ఆయనదంతా బోళా తరహా. పెద్దగా చదువుకోకున్నా.. కష్టపడి జీవితంలో ఎదిగారు. పాల వ్యాపారి నుంచి పైకి వచ్చి విద్యా సంస్థల అధిపతి అయ్యారు. ఆర్థికంగా తిరుగులేని స్థాయికి చేరుకున్నాక.. రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా ఎన్నికైనా.. టీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. అనంతరం 2018 ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దిగి మంత్రి అయ్యారు. ఆయన శైలికి తగినట్లే కార్మిక మంత్రిత్వ శాఖ దక్కింది. ఇదే సమయంలో ఆయనను రాజకీయంగానూ టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు ఉపయోగించుకుంటోంది.
మల్లన్న ఏం చేసినా సంచలనమే
మల్లారెడ్డి ఏడాది కిందట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన తీరు అందరికీ తెలిసిందే. వ్యక్తిగత, రాజకీయ విమర్శలు శ్రుతిమించినా.. తొడ కొట్టిన నాటి ప్రెస్ మీట్ తో మల్లారెడ్డి మరింత పాపులర్ అయ్యారు. ఇక ఇదే అదనుగా ఆయన్ను రాజకీయంగా ఎత్తులుపైఎత్తులకు టీఆర్ఎస్ వాడుకుంటోంది. రేవంత్ తో కలిసి టీడీపీలో కలిసి పనిచేసిన అనుభవం ఉండడంతో మల్లారెడ్డికి ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యం దక్కుతోంది. ఇక కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డి.. ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరైన ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి ప్రసంగం సంచలనం రేపింది. చిరంజీవిని అన్నా అని సంబోధిస్తూ.. ఓటీటీల నుంచి మొదలుపెట్టి.. చిరంజీవి ఆంధ్రా వ్యక్తి కాదనే వరకు మల్లారెడ్డి ప్రసంగం సాగింది. అసలు సినీ కార్మికులే ఓటీటీలు స్థాపించి హీరోలు కావాలంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. ఇదే మల్లారెడ్డి కొన్నేళ్ల కిందట చిరంజీవి కుమారుడు రాంచరణ్ వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
విద్యా సంస్థల నుంచి యూనివర్సిటీ దాకా
మంత్రి మల్లారెడ్డి 45 ఏళ్ల కిందట సైకిల్ పై రెండు పాల క్యాన్లు వేసుకుని వాటిని విక్రయిస్తూ తన వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. అలాఅలా ఎదుగుతూ విద్యా సంస్థల స్థాపన స్థాయికి వచ్చారు. ఇప్పుడవే విద్యా సంస్థలు యూనివర్సిటీగా మారాయి. ఆయనకు వైద్య కళాశాల కూడా ఉంది. మల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా ఇది నడుస్తోంది. ఆయన సంస్థలన్నీ మల్లారెడ్డి పేరిటే కొనసాగుతుండడం జీవితంలో పైకి వచ్చిన విధానానికి సంకేతంగా కనిపిస్తోంది.
మునుగోడులో మజాకానా..?
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తన సైన్యాన్ని అంతటినీ మోహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. మల్లారెడ్డికి కూడా ఓ ఎంపీటీసీ స్థానంలో బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గం మేడ్చల్ నుంచి 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో వాలిపోయారు. ఇక ఆ ఎంపీటీసీ స్థానం పరిధిలోని ఓటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అంతా తానే అయి చూసుకుంటున్నారు.
ప్రజలకు అధికారులతో పని కావాలంటే నేరుగా మాట్లాడి చేసి పెడుతున్నారు. గుడి కావాలంటే అక్కడికక్కడే రూ.లక్షలు ఇస్తున్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి తన బోధనాస్పత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. సర్జరీలు అవసరమైతే అవీ ఉచితంగానే చేయిస్తున్నారు. ఇక పార్టీ మారతామంటే ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, నాయకులకు తాయిలాలు సరేసరి. దీంతోపాటు ఎంపీటీసీ స్థానం పరిధిలోని పరిసర గ్రామాల్లోనూ మల్లారెడ్డి అన్నీ తానై అయి చక్కబెడుతున్నారు. దీన్నంటినీ చూసినవారు మల్లన్నా..? మజాకానా..? అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.