ఎక్కడో మొదలై.. మరెక్కడికో వెళుతున్న భావన కలిగిస్తున్న షారుక్ కొడుకు డ్రగ్స్ వ్యవహారం నెమ్మదిగా.. కేంద్రంలోని మోడీ సర్కారుకు మహారాష్ట్రలోని ఉద్దవ్ సర్కారుకు మధ్య కొత్త చిచ్చుకు కారణమవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. షారుక్ కొడుకుతో మొదలైన ఈ వ్యవహారం అంతకంతకూ విస్తరిస్తూ.. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖుడు.. దర్శకుడు కమ్ బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ వరకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. తెర మీదకు వచ్చిన మహారాష్ట్ర మంత్రి కమ్ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేయటమే కాదు.. షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ గా సుపరిచితుడు.. షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఈ అధికారి మరో ఏడాదిలో ఉద్యోగం పోయి.. జైలుకు వెళ్లటం ఖాయమని మంత్రి హెచ్చరించారు. ‘‘ఆయన్ను జైల్లో పెట్టే వరకు వదలం. ఏడాదిలో అతడి ఉద్యోగం పోతుంది. అతనో తోలుబొమ్మ మాత్రమే. ఆయన్ను కొందరు ఆడిస్తున్నారు. సమీర్ పై ఎవరు ఒత్తిడి తెస్తున్నారు చెప్పాలి’’ అని మండిపడ్డారు.
డ్రగ్స్ పేరుతో సమీర్ వాంఖడే సినీపరిశ్రమను టార్గెట్ చేశారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులోనూ సమీర్ ప్రత్యేక అధికారిగా వచ్చారని.. ఆ కేసును వదిలేసి.. చిత్ర పరిశ్రమ మీద పడ్డారన్నారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని సైతం తప్పుడు కేసులో ఇరికించారని.. క్రూజ్ లో స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్న డ్రగ్స్ ఎపిసోడ్ మొత్తం అబద్ధమన్నారు.
తాజాగా వాట్సాప్ చాట్ ఆధారంగానే అరెస్టు చేస్తున్నారన్నారు. సుశాంత్ ది సూసైడ్ అవునో కాదో ఇంతవరకు తేల్చలేదని.. ఆ తర్వాత ఈ ఎన్సీబీ ఎంట్రీ ఇచ్చి చిత్రపరిశ్రమను ఆడుకోవటం మొదలు పెట్టిందన్నారు. కరోనా వేళలో సినీ పరిశ్రమ మాల్దీవుల్లో ఉందని.. అప్పుడు సమీర్.. అతడి కుటుంబం మాల్దీవుల్లో.. దుబాయ్ ల్లో ఏం చేస్తుందో చెప్పాలన్నారు. ‘‘అతను దుబాయ్ లో ఉన్న ఫోటోల్నిబయటపెడతా. మల్దీవులకు వెళ్లి వసూళ్లకు పాల్పడ్డాడు. సమీర్ వాట్సాప్ చాట్స్ ను పరిశీలిస్తే.. ఎన్సీబీ పెట్టే కేసులు ఎంత బోగస్ అన్నది ఇట్టే అర్థమవుతుందన్నారు.
ఇదిలా ఉంటే మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణల్ని సమీర్ వాంఖడే ఖండించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలుగా తేల్చిన ఆయన.. తాను డిసెంబరులో దుబాయ్ లో ఉన్నట్లు చెప్పటం అబద్ధమన్నారు. ఆ సమయంలో తాను ముంబయిలోనే ఉన్నట్లు చెప్పిన ఆయన.. అధికారుల అనుమతితోనే తాను మాల్దీవులకు వెళ్లినట్లు చెప్పారు. దాన్ని దోపిడీ అనటం సరికాదని.. తాను ప్రభుత్వ ఉద్యోగినని.. డ్రగ్స్ నిరోధానికి నిజాయితీగా పని చేస్తున్నందుకు జైల్లో పెట్టాలనుకుంటే అందుకు స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. మొత్తంగా మహారాష్ట్ర మంత్రి.. సమీర్ వాంఖడేల వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.